My wife a Nagin | ఓ భర్త వింత ఫిర్యాదు – నాగినిగా మారి భయపెడుతున్న భార్య

ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య రాత్రిళ్లు “నాగినిగా మారిపోతుంది” అంటూ వింత ఫిర్యాదు చేశాడు. జిల్లా మేజిస్ట్రేట్‌ ఆ ఫిర్యాదు స్వీకరించి విచారణ ఆదేశించారు.

My wife a Nagin | ఓ భర్త వింత ఫిర్యాదు – నాగినిగా మారి భయపెడుతున్న భార్య

Man claims wife turns into ‘Nagin’ at night, files complaint in Sitapur

సీతాపూర్ (ఉ.ప్ర.):
ఒక వ్యక్తి తన భార్య రాత్రిళ్లు “నాగిని”(పాము)గా మరి తనను భయపెడుతోందని,  నిద్రపోలేకపోతున్నానని జిల్లా మేజిస్ట్రేట్‌కి వింత ఫిర్యాదు చేశాడు. లోధాసా గ్రామానికి చెందిన మెరాజ్‌ అనే వ్యక్తి, అక్టోబర్‌ 4న జరిగిన ‘సమాధాన్‌ దివస్‌’ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అభిషేక్‌ ఆనంద్‌ ముందు తన బాధను వివరించాడు.

మెరాజ్‌ చెప్పిందాని ప్రకారం, తన భార్య నసీమున్‌ మానసికంగా సమతుల్యత లేక రాత్రిళ్లు “నాగిని”లా నటిస్తూ,  బుస కొడుతూ భయపెడుతోందని అన్నాడు.  తనను కాటేస్తోందేమోనని భయంతో నిద్రపోవడం లేదని,  గడగడా వణికి చస్తున్నానని, కాపాడాలని విజ్ఞప్తి చేసాడు. దాంతో కలెక్టర్​తో సహా అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.  పలుమార్లు పోలీసులకు చెప్పినా స్పందించకపోవడంతో జిల్లా అధికారులను ఆశ్రయించాల్సి వచ్చిందని కూడా మెరాజ్​ చెప్పాడు. ప్రజావినతుల సమావేశంలో ఈ వింత ఫిర్యాదుతో కంగుతిన్న కలెక్టర్‌ పోలీసులను విచారణకు ఆదేశించారు. “ఫిర్యాదు అందింది. దానిపై దర్యాప్తు కొనసాగుతోంది” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

ఈ వింత ఫిర్యాదు ఒక్కసారిగా సోషల్​ మీడియాలో వైరల్ అయింది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. నాగస్వరం పక్కన పెట్టుకోండని, పాములు పట్టేవాడిని మీ బెడ్​రూమ్​లో కూర్చోబెట్టండని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.