6100 టీచర్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

విధాత, హైదరాబాద్‌ : 6100 టీచర్‌ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, వచ్చే నెల 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు. 2,299స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు..2,280ఎస్‌జీటీ పోస్టులు, 1264టీజీటీ పోస్టులు, 215పీజీటీ 42 ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశామన్నారు. 12నుంచి 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని, మార్చి 5నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌, 15నుంచి 30వరకు పరీక్షలు, 31న ప్రాథమిక కీ విడుదల, ఏప్రిల్‌ 1వ తేదీన కీ పైన అభ్యంతరాల స్వీకరణ, 2వ తేదీన ఫైనల్‌ కీ విడుదల.. ఏప్రిల్‌ 7న ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి బొత్స వెల్లడించారు.

నాలుగుసంవత్సరాలుగా డీఎస్సీ ఊసెత్తని ప్రభుత్వం.. ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. మొత్తం 6 వేల 100 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే రాష్ట్రంలో 25 వేల పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. కేవలం 6 వేల 100 పోస్ట్‌లకు మాత్రమే డీఎస్సీ ప్రకటన ఇవ్వగా, ప్రభుత్వ నిర్ణయం పట్ల కొంత మోదం..మరికొంత ఖేదం వ్యక్తమవుతున్నది.


ఈ నెల 27నుంచి మార్చి 9వరకు టెట్‌ పరీక్షలు..


ఈనెల 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ నోటిఫికేషన్ విడుదలవుతుందని మంత్రి బొత్స సత్యనారాయం తెలిపారు. 23వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్ లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రాథమిక కీ మార్చి 10వ తేదీన వెల్లడిస్తారని, కీపై అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఫైనల్ కీ మార్చి 13వ తేదీన రిలీజ్ చేస్తారని, మార్చి 14వ తేదీన టెట్ తుది ఫలితాలు వెలువడుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Updated On 11 Feb 2024 3:29 AM GMT
Somu

Somu

Next Story