కొత్త‌గా 15 అగ్నిమాప‌క కేంద్రాలు.. 382 పోస్టులు మంజూరు

విధాత: తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌గా, ఇందులో చాలా మ‌టుకు పోస్టులు భ‌ర్తీ అయ్యాయి. మ‌రికొన్ని పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇటీవ‌లే ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమిన‌రీ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే ఆ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. గ్రూప్ -1 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి చ‌ర్య‌లు వేగ‌వంతం అయ్యాయి. రెండు రోజుల క్రితం గ్రూప్ -1 ప్రిలిమిన‌రీ తుది కీ విడుద‌ల చేశారు. మ‌రో రెండు, […]

కొత్త‌గా 15 అగ్నిమాప‌క కేంద్రాలు.. 382 పోస్టులు మంజూరు

విధాత: తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌గా, ఇందులో చాలా మ‌టుకు పోస్టులు భ‌ర్తీ అయ్యాయి. మ‌రికొన్ని పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఇటీవ‌లే ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమిన‌రీ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.

త్వ‌ర‌లోనే ఆ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. గ్రూప్ -1 ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి చ‌ర్య‌లు వేగ‌వంతం అయ్యాయి. రెండు రోజుల క్రితం గ్రూప్ -1 ప్రిలిమిన‌రీ తుది కీ విడుద‌ల చేశారు. మ‌రో రెండు, మూడు నెల‌ల్లో మెయిన్స్ నిర్వ‌హించి ఆ ఉద్యోగాల‌ను కూడా భ‌ర్తీ చేయ‌నున్నారు.

తాజాగా రాష్ట్రంలో కొత్తగా 15 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. మల్కాజ్‌ గిరి, ఎల్బీనగర్‌, అంబర్‌పేట, జూబ్లీహిల్స్‌, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, డోర్నకల్, నర్సాపూర్‌, హుస్నాబాద్‌, బాల్కొండ, కల్వకుర్తి, ధర్మపురి, పినపాకలో ఇవి ఏర్పాటు కానున్నాయి.

కొత్త అగ్నిమాపక కేంద్రాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 382 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో రెగ్యులర్‌ ప్రాతిపదికన 367, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 15 పోస్టులను భర్తీ చేస్తారు. కొత్త కేంద్రాలు, పోస్టులు మంజూరు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.