ప్రశాంత్‌కి అంత ధైర్యం ఏంటి.. నాగార్జున చెప్పిన ఎవిక్షన్ పాస్ వాడని రైతుబిడ్డ

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం 13వ వారం కూడా పూర్తి చేసుకుంది. మరో రెండు వారాలలో సీజన్ 7 కూడా ముగియనుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిగ్ బాస్ హౌజ్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా, ఆదివారం రోజు గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు. దీంతో మొత్తం హౌజ్‌లో 7గురు ఉండగా, వీరంతా గ్రాండ్ ఫినాలే వరకు వెళ్లనున్నారని టాక్ నడుస్తుంది. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలియజేశాడు నాగార్జున. అక్షరాలా రూ. 50 లక్షల నగదు విన్నర్ కి దక్కుతుందని, వాటితో పాటు మారుతి సుజుకి బ్రీజ్ కారు తో పాటు 15 లక్షల విలువ చేసే డైమండ్ జ్యువెలరీ కూడా దక్కుతుంది అని నాగార్జున తెలియజేశారు.
అయితే ప్రైజ్ మనీ వస్తే ఎవరెవరు ఏం చేస్తారని నాగార్జున అడగగా, దానికి గౌతమ్, ప్రియాంక, శోభా శెట్టి తమ కుటుంబ సభ్యుల కోసం, తల్లి దండ్రుల కోసం, సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు వాడతామని తెలిపారు. ప్రశాంత్ మాత్రం కష్టాల్లో ఉన్న రైతులని ఆదుకునేందుకు మొత్తం వెచ్చిస్తానని అన్నారు. శివాజి తాను ఏమి అనుకోలేదని తెలియజేశారు. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున తాను నటించిన నా సామిరంగ గ్లింప్స్ విడుదల చేశాడు. అలానే తన మూవీ హీరోయిన్ ఆషిక రంగనాథ్ ని అందరికి పరిచయం చేశాడు.అనంతరం నేచరుల్ స్టార్ నాని హాయ్ నాన్న చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. హాయ్ నాన్న విశేషాలని నాగార్జునతో కలిసి పంచుకున్న నాని సరదాగా కంటెస్టెంట్స్‌పై జోకులు వేశారు. ఇక వెళుతూ వెళుతూ శివాజీని సేవ్ చేసాడు నాని.
అనంతరం మరో సేవింగ్ రౌండ్ లో శోభా, గౌతమ్, ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. ప్రశాంత్ కి ఎవిక్షన్ ప్రీ పాస్ ఉండగా, దానిని ఈ వారమే వాడుకోవాలని నాగార్జున చెప్పారు. నీకు కాని లేదంటే మిగిలిన ఇద్దరికి అయిన వాడొచ్చని నాగ్ తెలియజేయడంతో ప్రశాంత్ తాను ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు వెళతానని అన్నాడు. ఎవిక్షన్ పాస్ తాను వాడకుండా, మిగతా ఇద్దరికి ఇవ్వకుండా వేస్ట్ చేశాడు. అయితే చివరకి ప్రశాంత్ ధైర్యమే గెలిచింది. ఆ ముగ్గురిలో ప్రశాంత్ సేవ్ కాగా, చివరికి శోభా శెట్టి, గౌతమ్ మాత్రమే ఉన్నారు. వారిని నాగార్జున ప్రత్యేక రూమ్ కి అందులో ఎవరి వెనుక ఉన్న డ్రాగన్ శ్వాస ఆగిపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారని అన్నారు. గౌతమ్ వెనుక ఉన్న డ్రాగన్ శ్వాస ఆగిపోవడంతో అతను ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు నాగ్. ఎపిసోడ్ చివరలో పెద్ద ట్విస్ట్ కూడా ఇచ్చారు. అర్జున్ టికెట్ టూ ఫినాలే గెలుపొంది ఫైనల్‌కి చేరిన నేపథ్యంలో ఆయన సేవ్ అయ్యాడని, లేదంటే ప్రేక్షకుల ఓట్ల ప్రకారం అతనే ఈ వారం ఎలిమినేట్ అయ్యేవాడని నాగ్ స్పష్టం చేశారు.