Battai Fruit | బ‌త్తాయి పండుతో ఇన్‌ఫెక్ష‌న్ల‌కు చెక్.. ఇంకా ఎన్నో లాభాలు..!

Battai Fruit | బ‌త్తాయి పండుతో ఇన్‌ఫెక్ష‌న్ల‌కు చెక్.. ఇంకా ఎన్నో లాభాలు..!

Battai Fruit | యాపిల్స్, దానిమ్మ‌, నారింజ, మామిడి వంటి పండ్ల‌ను తిన‌డానికి చాలా మంది ఆస‌క్తి చూపుతారు. కానీ బ‌త్తాయిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే అది పుల్ల‌గా ఉండ‌టం వ‌ల్లే. కానీ బ‌త్తాయి పండును తిన‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అంతే కాదు.. శ‌రీరంలో మంట‌, అజీర్ణం, గ్యాస్ట్రిక్ వంటి స‌మ‌స్య‌ల నుంచి కూడా విముక్తి పొందొచ్చు.

బ‌త్తాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల‌కు చెక్ పెట్టొచ్చు. విట‌మిన్ సీ, ఫైబ‌ర్ కూడా శ‌రీరానికి అందుతోంది. దీంతో ఆహారం కూడా సుల‌భంగా జీర్ణ‌మ‌వుతోంది. ఈ పండు తిన‌డం వ‌ల్ల 45 కేల‌రీలు అందుతాయి శ‌రీరానికి.

డీ హైడ్రేష‌న్‌తో బాధ‌ప‌డేవారు కూడా బ‌త్తాయి జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. అయితే ఆ జ్యూస్‌లో చ‌క్కెర వేయొద్దు. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌ర్మం కూడా చాలా మృదువుగా మారిపోతంది. కాంతివంతంగా నిగ‌నిగ‌లాడుతుంది. జుట్టు కూడా మంచిగా వ‌స్తుంది. కంటి ఇన్‌ఫెక్ష‌న్లు కూడా రావు. కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు బ‌త్తాయిని తింటే మంచిది.

అధిక బ‌రువుతో బాధ‌ప‌డేవారు బ‌త్తాయి పండును క‌చ్చితంగా మెనూలో చేర్చుకోవ‌డం మంచిది. బ‌త్తాయి బ‌రువును త‌ప్ప‌కుండా త‌గ్గిస్తుంది. వాంతులు, వికారంతో బాధ‌ప‌డేవారు బ‌త్తాయిని తిన‌డం వ‌ల్ల‌.. ఆ ల‌క్ష‌ణాలు త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండేందుకు బ‌త్తాయి ఉప‌యోగ‌ప‌డుతుంది. కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డేవారు బ‌త్తాయిని తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారి.. ఆ స‌మ‌స్య నుంచి విముక్తి పొందొచ్చు. అలాగే ఎంతో మంది స్త్రీలకు కాలి పాదాలు పగిలిపోతూ ఉంటాయి. ఆ సమస్య నుంచి బయటపడేసే సత్తా బ‌త్తాయికి ఉంది. కాబట్టి బత్తాయి పండును కచ్చితంగా తినండి.