త్వరలో హైదరాబాద్‌లో కృష్ణ మెమోరియల్.. కాంస్య విగ్రహం
నిర్ణయించిన కుటుంబ సభ్యులు విధాత: సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం, మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కృష్ణ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. కృష్ణ మెమోరియల్‌లో ఆయన నటించిన 350 చిత్రాల ఫొటోలు, షీల్డ్‌లు ఉంచి, అభిమానులు, సందర్శకులు వాటిని వీక్షించేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో కృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిర్ణయించిన కుటుంబ సభ్యులు
విధాత: సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం, మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కృష్ణ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కుటుంబ సభ్యులు చెపుతున్నారు.
కృష్ణ మెమోరియల్‌లో ఆయన నటించిన 350 చిత్రాల ఫొటోలు, షీల్డ్‌లు ఉంచి, అభిమానులు, సందర్శకులు వాటిని వీక్షించేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో కృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.