బీజేపీలో చేరబోతున్న నాయకుడి జననాంగాలపై దాడి చేసి చంపేశారు
కర్ణాటకలో దారుణం రాజకీయ హత్యా లేదా దోపిడీ దొంగల పనా విధాత: కర్ణాటకలో దారుణం జరిగింది. జనతా దళ్(సెక్యూలర్) మాజీ నాయకుడిని అత్యంత దారుణంగా చంపేశారు. ఆ లీడర్ జననాంగాలపై దాడి చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే జేడీఎస్ మాజీ నాయకుడు మల్లికార్జున్ ముత్యాల్(64) త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి మల్లికార్జున్ ముత్యాల్ హాజరయ్యారు. కొద్ది […]

- కర్ణాటకలో దారుణం
- రాజకీయ హత్యా లేదా దోపిడీ దొంగల పనా
విధాత: కర్ణాటకలో దారుణం జరిగింది. జనతా దళ్(సెక్యూలర్) మాజీ నాయకుడిని అత్యంత దారుణంగా చంపేశారు. ఆ లీడర్ జననాంగాలపై దాడి చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే జేడీఎస్ మాజీ నాయకుడు మల్లికార్జున్ ముత్యాల్(64) త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి మల్లికార్జున్ ముత్యాల్ హాజరయ్యారు. కొద్ది రోజుల్లోనే బీజేపీలో చేరుతానని కూడా ప్రకటించారు. అంతలోనే ఈ దారుణం జరిగింది. ముత్యాల్ మృతదేహాన్ని అతని షాపు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాపులో ఉన్న నగదును కూడా దుండగులు దోచుకెళ్లారు. ఇది దోపిడీ దొంగలు చేసిన పనా? లేక రాజకీయ హత్యనా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ముత్యాల్ కుమారుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. తమకు ఎలక్ట్రానిక్ దుకాణం ఉందని, సోమవారం రోజు నాన్న దుకాణంలోనే నిద్రించాడని తెలిపాడు. రాత్రి సమయంలో షాపులోకి ప్రవేశించిన దుండగులు, నాన్నను చంపి నగదు దోచుకెళ్లారని.. కొన్ని డాక్యుమెంట్లను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని పోలీసులను కోరినట్లు వెంకటేశ్ పేర్కొన్నారు.
పోలీసులు మాట్లాడుతూ.. ముత్యాల్ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. అతని జననాంగాలపై రాళ్లతో దాడి చేసి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయన్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.