వేదిక పైనే కింద పడ్డ కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ
విధాత: బెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. సిలిగురిలో పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలకు హాజరైన నితిన్‌గడ్కరీ వేదిక పైనే అస్వస్థతకు గురై కింద పడి పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోవడం వల్లే అస్వస్థతకు గురయినట్లు వైద్యులు తెలిపారు. గడ్కరీ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులను, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థతిని […]

విధాత: బెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. సిలిగురిలో పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలకు హాజరైన నితిన్‌గడ్కరీ వేదిక పైనే అస్వస్థతకు గురై కింద పడి పోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోవడం వల్లే అస్వస్థతకు గురయినట్లు వైద్యులు తెలిపారు. గడ్కరీ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులను, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థతిని తెలుసుకున్నారు.