ఫుల్‌గా మందేసి శివాలయానికి వెళ్లిన రాజశేఖర్.. ఆ అమ్మాయి వల్లనే ఇలా చేశాడట..!

యాంగ్రీమెన్ రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఒకప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న రాజశేఖర్ తన కెరీర్‌లో ఎన్ని మంచి చిత్రాలు చేశాడు. ముఖ్యంగా పోలీస్ పాత్రలు పోషించి మెప్పించాడు. తండ్రి కోరిక మేరకు డాక్టర్ అయిన రాజశేఖర్ అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎన్నో చిత్రాలు చేశారు. వందేమాతరం సినిమాతో డెబ్యూ ఇచ్చిన రాజశేఖర్.. ప్రతిఘటన సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు . అంకుశం సినిమాలో రాజశేఖర్ పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసిందంటే ఆ పాత్రలో ఆయన ఎంత ఒదిగిపోయారో అర్ధం చేసుకోవచ్చు
ఇక రాజశేఖర్‌కి నత్తి సమస్య ఉండడం వలన ఆయనకి సాయి కుమార్ గాత్రదానం చేస్తాడు. నత్తి వలన ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ నటనతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఒకప్పుడు కెరీర్ సజావుగానే సాగిన తర్వాత అతని సినిమాలు ఆడక సొంత ఇల్లు కూడా అమ్ముకున్నాడు. ఇక గరుడవేగ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా, ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కుకోగలిగారు రాజశేఖర్. ఇటీవలే నితిన్ నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించారు. అయితే రాజశేఖర్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. తనకు దేవుడంటే నమ్మకం ఉండేది కాదని, ఒకప్పుడు తాను తనకంటే ఐదేళ్లు ఎక్కువ వయస్సు ఉన్న అమ్మాయిని ప్రేమించానని, ఆమె రిజెక్ట్ చేసిందని స్పష్టం చేశాడు.
ప్రేమించిన అమ్మాయి నో చెప్పడంతో మందు, సిగరెట్స్‌కి అలవాటు పడ్డాను. దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని ఓ ఫ్రెండ్ అన్నాడు. అదే సమయంలో పక్కన ఉన్న ఓ శివాలయానికి ఫుల్‌గా తాగేసి వెళ్లాను.. మీ పై నాకు నమ్మకం లేదు.. నేను తాగి ఉన్నాను.. క్షమించమని అడిగాను.. అలాగే తాను ఓ అమ్మాయిని ప్రేమించానని కానీ ఆమె రిజెక్ట్ చేసిందని తన బాధని దేవుడితో చెప్పుకున్నా.ఒకవేళ ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే నువ్వు ఉన్నావని నమ్ముతాను. లేదంటే రాయి అని అనుకుంటాను అని అన్నాడట. అయితే తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో ఆ అమ్మాయే వచ్చి ఐ లవ్ యూ అని చెప్పడంతో పాటు మర్యాదగా కూడా పిలవడంతో చాలా షాక్ అయ్యాడట రాజశేఖర్.