ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి ఏమైంది… ఎందుకు ఇలా మారిపోయింది…!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌కి ఏమైంది… ఎందుకు ఇలా మారిపోయింది…!

ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న అందంతో పాటు న‌ట‌న‌తో తెలుగు, త‌మిళ ప్రేక్షకుల‌ని ఎంత‌గానో క‌ట్టిప‌డేసింది. తెలుగులో దాదాపు అంద‌రు స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. ఈ క్ర‌మంలో మంచి హిట్స్ కూడా అందుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో కూడా అదృష్టం ప‌రీక్షించుకుంది. అక్క‌డ హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసింది. అయితే అక్కడే ప్రేమలో కూడా పడింది రకుల్. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడిన రకుల్ ఈ విష‌యాన్ని 2021 లోనే ప్రకటించింది. అప్పట్నుంచి వీరిద్దరూ ప్రేమలోనే ఉండ‌గా వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అంద‌రు ఆస‌క్త‌గా ఎదురు చూస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు ఫిబ్రవరి 22న ఈ జంట వివాహం జరగబోతున్నట్టు తెలుస్తుంది. గోవాలో ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నార‌ని, వేడుక‌కి కేవలం ఫ్యామిలీ, పలువురు సన్నిహితులు మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ని అంటున్నారు. పెళ్లి త‌ర్వాత ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్ర‌ముఖుల‌ని ఆహ్వానిస్తార‌ని స‌మాచారం..ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎప్ప‌టిక‌ప్పుడు వెరైటీ ఫొటోల‌తో అంద‌రి దృష్టి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా రకుల్ డేరింగ్ ఫొటోషూట్ తో అంద‌రు దిమ్మ‌తిరిగిపోయేలా చేసింది. ఇలా ర‌కుల్‌ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

‘మెట్రో పాలిటన్’ మ్యాగజైన్ కవర్ ఫొటోషూట్‌లో భాగంగా ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ డ్రెస్ లో కిర్రాక్ హెయిర్ స్టైల్ తో మ‌తులు పోగొట్టింది ర‌కుల్‌. లోప‌ల ఏమి వేసుకోకుండా క‌నిపించి క‌నిపించ‌న‌ట్టు త‌న అందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. ఇలా ర‌కుల్‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా అద‌ర‌హో అంటున్నారు. అస‌లు గుర్తు ప‌ట్ట‌కుండా ఉన్నావ‌ని కామెంట్ చేస్తున్నారు. ఇక ర‌కుల్ చివ‌రిగా తమిళ చిత్రం ‘ఆయాలాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వ‌లో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ‘ఇండియన్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో భారీ స్థాయిలో ఈ చిత్రంపై అమ్మ‌డు భారీ అంచ‌నాలే పెట్టుకుంది.