ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
విధాత: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించనున్నారు. మార్చి 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఏపీలో కూడా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకాశం - నెల్లూరు - చిత్తూరు గ్రాడ్యుయేట్స్, కడప - అనంతపూర్ […]

విధాత: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఈ నెల 16వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించనున్నారు. మార్చి 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు.
ఏపీలో కూడా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్
ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు గ్రాడ్యుయేట్స్, కడప – అనంతపూర్ – కర్నూల్ గ్రాడ్యుయేట్స్, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్టణం గ్రాడ్యుయేట్స్, ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, కడప – అనంతపూర్ – కర్నూల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.