వెలుగులోకి అఫ్తాబ్ అరాచ‌కాలు

విధాత: ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య కేసులో అఫ్తాబ్‌ అరాచాకాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అఫ్తాబ్‌ ఇచ్చిన సమాచారం, వివరాల ఆధారంగా గుట్టురట్టు చేస్తున్నారు. బంబల్‌ డేటింగ్‌ యాప్‌లో యువతులకు ఎర వేసినట్లు గుర్తించిన పోలీసులు ఈ దిశగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం బంబల్‌ డేటింగ్‌ లిస్ట్‌ తెలుకోవడానికి ఆ యాప్‌ల యజమానికి పోలీసులు లేఖ రాసారు. అఫ్తాబ్‌ ప్రొఫైల్‌ వివరాలు, […]

వెలుగులోకి అఫ్తాబ్ అరాచ‌కాలు

విధాత: ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య కేసులో అఫ్తాబ్‌ అరాచాకాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అఫ్తాబ్‌ ఇచ్చిన సమాచారం, వివరాల ఆధారంగా గుట్టురట్టు చేస్తున్నారు.

బంబల్‌ డేటింగ్‌ యాప్‌లో యువతులకు ఎర వేసినట్లు గుర్తించిన పోలీసులు ఈ దిశగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం బంబల్‌ డేటింగ్‌ లిస్ట్‌ తెలుకోవడానికి ఆ యాప్‌ల యజమానికి పోలీసులు లేఖ రాసారు. అఫ్తాబ్‌ ప్రొఫైల్‌ వివరాలు, ఆయన ప్రొఫెల్‌ చూసిన యువతుల వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ యాప్‌ ద్వారా అఫ్తాబ్‌ మరో యువతితో డేటింగ్‌ చేస్తూ శ్రద్ధను హత్య చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బంబల్‌ యాప్‌ ద్వారా పరిచయమైన శ్రద్ధతో అఫ్తాబ్‌ సహజీవనం చేస్తూ.. పెళ్లి ప్రస్తావన తీయడంతో గొంతుకోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. అదే డేటింగ్‌ యాప్‌తో మరో యువతితో పరిచయం పెంచుకున్నాడు. శ్రద్ధ శవం ఇంట్లో ఉండగానే కొత్త యువతిని పలుమార్లు ఇంటికి తీసుకొచ్చినట్లు అఫ్తాబ్‌ పోలీసుల విచారణలో తెలిపాడు. శ్రద్ధను ముక్కలు ముక్కలుగా నరికి పడేసిన మెహరోలీ అడవుల్లోకి అఫ్తాబ్‌ని తీసుకెళ్లిన పోలీసులు ఇప్పటికే 12 శరీర భాగాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

హత్యకు వాడిన ఆయుధం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాదు అఫ్తాబ్‌ ఇన్‌ స్టామ్‌లో యాక్టివ్‌గా ఉన్నాడ‌ని, సుమారు 28 వేల ఫాలోవర్స్ ఉన్నారని గుర్తించారు. రెస్టారెంట్లు, హోటల్స్‌ రివ్యూ చేస్తుంటాడని పోలీసులు వెల్లడించారు.