త‌న క్యూట్ అందాల‌తో కుర్రాళ్ల‌కి గిలిగింత‌లు పెడుతున్న అందాల ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో కుర్రాళ్ల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. 2017లో నిధి అగర్వాల్ కేరీర్ బాలీవుడ్ లో మొద‌లు కాగా, ఆమె డెబ్యూ మూవీ మున్నా మైఖేల్. ఈ చిత్రం త‌ర్వాత 2018లో సవ్యసాచి అనే చిత్రంలో నాగ చైతన్యకు జంటగా ఆమె నటించారు. ఈ సినిమా తేడా కొట్టింది. అన్నయ్యతో వర్క్ అవుట్ కాలేదని తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేసిన అది కూడా నిరాశపరిచింది. అయితే దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ ముద్దుగుమ్మ‌కి మంచి విజ‌యం ద‌క్కేలా చేశాడు.

నిధి అగ‌ర్వాల్ ఇస్మార్ట్ శంక‌ర్ అనే ద‌ర్శ‌క‌త్వంలో రామ్ స‌ర‌స‌న న‌టించింది. ఇందులో నిధి త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు అందంతో అద‌ర‌హో అనిపించింది. ఇక ఈ సినిమా హిట్ త‌ర్వాత తమిళంలో భూమి, ఈశ్వరన్ అనే చిత్రాలు చేసింది.అవి అంత‌గా ఆడ‌క‌పోవ‌డంతో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీ హీరో లో నటించింది. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఈ సినిమా ఫ్లాప్ అయిన కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో మంచి అవకాశం అందుకుంది నిధి. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ పక్కన ఆమెకు ఛాన్స్ రావడం ఊహించని పరిణామంగా చెప్పాలి.. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఆలస్యం అవుతూ వ‌స్తుండ‌గ‌,ఆ వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంద‌ని అంటున్నారు. ఇక మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ మూవీలో కూడా ఆమె ఓ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ న‌డుస్తుంది.

ఇక నిధి అగ‌ర్వాల్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. స్కిన్ షో చేసిన వాళ్ళకే అవకాశాలు ఉంటాయని , హీరోయిన్ గా ఎదగాలంటే ఎక్స్ పోజ్ చేయడం తప్పనిసరి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక స్క్రిప్ట్ సెల‌క్ష‌న్‌లో ఏమి ఉండ‌దు, అంతా మ‌న ల‌క్‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. పేపర్ మీద అద్భుతం చేస్తాయ‌నుకున్న కథలు వెండితెరపై తేలిపోతాయి. సాదాసీదా అనుకున్న కథలు సిల్వర్ స్క్రీన్ పై మాత్రం అద్భుతం చేస్తాయంటూ నిధి చెప్పుకొచ్చింది.ఇక ఈ అమ్మ‌డి కెరీర్ మంచిగా సాగాల‌ని ఇటీవ‌ల వేణు స్వామితో నిధి ప్రత్యేక పూజలు చేయించుకుంది. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి.

sn

sn

Next Story