శివాజి.. ఈ వ్య‌క్తిని కొన్ని నెల‌ల ముందు వ‌రకు చాలా మంది మ‌ర‌చిపోయారు. ఈ జ‌న‌రేష‌న్ వాళ్ల‌కి శివాజి గురించి కూడా పెద్ద‌గా తెలియ‌దు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ షోలో శివాజి తెగ సంద‌డి చేస్తుండ‌గా, ఆయ‌న గురించి తెలుసుకునేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. శివాజి త‌న కెరియ‌ర్‌లో హీరోగా 96 సినిమాలు చేశాడు. ప‌లు సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. మిస్స‌మ్మ సినిమాతో శివాజీ అందరి దృష్టిని ఆక‌ర్షించాడు. ఈ చిత్రంలో భూమిక లయ క‌థానాయిక‌లుగా న‌టించగా, ఈ మూవీ పెద్ద హిట్ అయింది. ఈ సినిమా తర్వాత శివాజీ ఒట్టేసి చెబుతున్నా, ఖుషి, ఇంద్ర, సందడే సందడి, ప్రియమైన నీకు ఇలా చాలా సినిమాల్లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు.

అయితే కొన్నాళ్లుగా శివాజి సినిమాల‌కి పూర్తిగా దూరంగా ఉన్నారు. అప్పుడ‌ప్పుడు రాజ‌కీయాల గురించి త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. అయితే ఎవ‌రు ఊహించ‌ని విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా గేమ్ ఆడుతూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు. శివాజి గురించి తెలియ‌ని వాళ్లు కూడా ఆయ‌న‌కి బాగా క‌నెక్ట్ అవుతున్నారు. బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక శివాజికి సినిమా అవ‌కాశాలు మ‌రింత వ‌స్తాయని ప‌లువురు భావిస్తున్నారు. అయితే శివాజి ప్ర‌స్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో త‌న ఆట ఆడుకుంటూనే రైతుబిడ్డ ప్ర‌శాంత్‌కి ఫుల్ స‌పోర్ట్ అందిస్తున్నాడు.

అయితే శివాజికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. కెరీర్ పీక్స్‌లో ఉండ‌గా, శివాజికి మంచి ఆఫ‌ర్ ద‌క్కింద‌ట‌. అదే సినిమా అంటే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చి తొలి ప్రేమ. సినిమా డైరెక్టర్ కరుణాకరన్ ఆడిషన్స్ చేస్తున్న టైంలో మాస్టారు చిత్రంలో నటించిన శివాజీని చూసి ఈయన బాగుంటుంది అనుకున్నారు. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పోస్టర్ని చూసిన కరుణాక‌ర‌ణ్ హీరో అంటే ఇలా ఉండాలి, ఈయ‌నే నా ప్రేమ క‌థ‌కి ప‌ర్‌ఫెక్ట్ అని అనుకున్నార‌ట‌. దాంతో క‌రుణాక‌రణ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆయ‌న‌ని ఒప్పించి సినిమా చేయ‌డం, అది ఎంత పెద్ద హిట్ అయిందో మ‌నం చూశాం. ఒక‌వేళ ఈ సినిమా శివాజి చేసి ఉంటే ఆయ‌న క్రేజ్ ఓ రేంజ్‌కి జ‌రిగి ఉండేది

sn

sn

Next Story