ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో 35 ఏళ్ల‌కి పైగా వ‌య‌స్సు ఉన్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వీరిలో కొంద‌రు రిలేష‌న్‌లో ఉండ‌గా, ఏదో ఒక స‌మ‌యంలో వారు పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే కొంద‌రు భామ‌లు తాము త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు హింట్స్ కూడా ఇచ్చారు. మ‌రి కొంద‌రు మాత్రం ఇంకా స‌స్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది పెళ్లి పీట‌లెక్కే అందాల భామ‌ల విష‌యానికి వ‌స్తే.. మొద‌ట ర‌కుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్టు స‌మాచారం. ఒక‌ప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ని షేక్ చేసిన ఈ భామ‌కి పెద్దగా అవ‌కాశాలు రావ‌డం లేదు. దీంతో ఈ భామ త‌న ప్రియుడు జాకీ భ‌గ్నానీని ఫిబ్ర‌వ‌రి 22వ తేదిన పెళ్లి చేసుకోనున్న‌ట్టు స‌మాచారం.

మొద‌ట వీరు విదేశాల్లో పెళ్లి చేసుకోవాల‌ని భావించ‌గా, మోదీ ఇచ్చిన సూచ‌న‌ల‌తో గోవాలోని ఓ రిసార్ట్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ర‌కుల్ త‌ర్వాత పెళ్లి పీటలెక్క‌నున్న మ‌రో అందాల భామ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఈ అమ్మ‌డు కొన్నాళ్లుగా న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంది. ఇద్ద‌రు క‌లిసి తెగ చెట్టా ప‌ట్టాలు వేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. తమన్నా విజయ్ వర్మ పెళ్లి ఈ ఏడాదే జరగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే తమన్నా నుంచి ఇందుకు సంబంధించి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.మరో స్టార్ హీరోయిన్ కృతి కర్భందా..పుల్కిత్ సామ్రాట్ తో ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకోగా త్వరలోనే పెళ్లితేదీకి సంబంధించిన ప్రకటన రానుందని తెలుస్తోంది.

ఇక అందాల ముద్దుగుమ్మ మీరాచోప్రా ఈ ఏడాది మార్చి నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. ఇక అనుష్క కూడా ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోనుంద‌నే టాక్ ఒక‌టి వినిపిస్తుంది. ఫిబ్రవరి నెల 10 తర్వాత మంచి మూహూర్తాలు ఉండటంతో చాలాంది సెలబ్రిటీలు పెళ్లికి సంబంధించిన తీపికబురును చెప్పడానికి సిద్ధమయ్యారు.అయితే ఈ భామ‌లు బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్ట‌డంతో కొంద‌రు సంతోషం వ్య‌క్తం చేస్తున్నా మ‌రి కొంద‌రికి హార్ట్ బ్రేక్ అయినంత ప‌ని అవుతుంది.

Updated On 12 Feb 2024 7:51 AM GMT
sn

sn

Next Story