అత్యంత వేగంగా వ్యాపిస్తున్న500 రకాల వైరస్‌లు: WHO
ఏమరుపాటుగా ఉంటే మొదటికే మోసం.. రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన కనీస జాగ్రత్తలు తప్పక పాటించాలి.. విధాత: కరోనా మహమ్మారి తోక ముడిచిందని ప్రపంచమంతా మురిసిపోతున్నపరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) పిడుగులాంటి వార్త బయట పెట్టింది. కొవిడ్ -19 తగ్గిపోయిందని అందరూ అజాగ్రత్తగా వ్యవహరిస్తే మొదటికే మోసమని హెచ్చరిస్తున్నది. కరోనా వైరస్‌లే కాకుండా శ్వాసకోశ వ్యాధులు కలగజేసే వైరస్‌లు, ఫ్లూ కారకాలు, ఇతర వ్యాధి కారక వైరస్‌లు అత్యంత వేగంగా ప్రపంచ దేశాల్లో […]

- ఏమరుపాటుగా ఉంటే మొదటికే మోసం..
- రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచన
- కనీస జాగ్రత్తలు తప్పక పాటించాలి..
విధాత: కరోనా మహమ్మారి తోక ముడిచిందని ప్రపంచమంతా మురిసిపోతున్నపరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) పిడుగులాంటి వార్త బయట పెట్టింది. కొవిడ్ -19 తగ్గిపోయిందని అందరూ అజాగ్రత్తగా వ్యవహరిస్తే మొదటికే మోసమని హెచ్చరిస్తున్నది.
కరోనా వైరస్‌లే కాకుండా శ్వాసకోశ వ్యాధులు కలగజేసే వైరస్‌లు, ఫ్లూ కారకాలు, ఇతర వ్యాధి కారక వైరస్‌లు అత్యంత వేగంగా ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తున్నాయని తెలిపింది. వీటి నుంచి రక్షణ పొందే ఏర్పాట్లు చేసు కోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కొవిడ్-19 విభాగ అధిపతి మారియా వాన్ కేర్ఖోవ్ హెచ్చరించటం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే అమెరికాలో మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ సీజన్‌లో 1.3 కోట్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు నమోదయ్యాయి. వీరిలో ఒక లక్షా 20 వేల మంది హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితి తలెత్తింది. ఫ్లూతో 7,300 మరణాలు సంభవించాయి.
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో 500 రకాల వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయటం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో ముక్కుకు మాస్క్, చేతులు తరచుగా కడుగుకోవటం లాంటి కనీస జాగ్రత్తలు కూడా అవసరం లేదనే వారు ఇక నుంచి ఇవన్నీ పాటించి తీరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని సాధారణ జీవితంలోకి వస్తున్న ప్రపంచానికి తాజా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమున్నదననడంలో సందేహం లేదు.