గుండె సంబంధిత వ్యాధులకు వయస్సుతో నిమిత్తం లేదు..!
కుటుంబ చరిత్రే ప్రధానం కనీస జాగ్రత్తలతో హార్ట్ అటాక్ నుంచి బయట పడొచ్చు విధాత: కొన్ని ఉదంతాలను చూస్తే గుండె గుబేల్‌మంటుంది. ఉన్నట్టుండి కిందపడిపోయి ప్రాణాలు వదులుతున్నారు. అప్పటిదాకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనట్టి వారు అకస్మాత్తుగా కుప్పకూలటం చూస్తున్నాం. వయస్సుతో కూడా సంబంధం ఉండటం లేదు. ముప్పై ఏండ్ల యువకులు కూడా హార్ట్ అటాక్‌తో కన్నుమూస్తున్న ఘటనలుంటున్నాయి. ఇలాంటి ఉదంతాలు చూసిన తర్వాత ఈ గడియకు క్షేమమని చెప్పుకొనే స్థితి వచ్చింది. ఈ మధ్య కాలంలో […]

- కుటుంబ చరిత్రే ప్రధానం
- కనీస జాగ్రత్తలతో హార్ట్ అటాక్ నుంచి బయట పడొచ్చు
విధాత: కొన్ని ఉదంతాలను చూస్తే గుండె గుబేల్‌మంటుంది. ఉన్నట్టుండి కిందపడిపోయి ప్రాణాలు వదులుతున్నారు. అప్పటిదాకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనట్టి వారు అకస్మాత్తుగా కుప్పకూలటం చూస్తున్నాం. వయస్సుతో కూడా సంబంధం ఉండటం లేదు. ముప్పై ఏండ్ల యువకులు కూడా హార్ట్ అటాక్‌తో కన్నుమూస్తున్న ఘటనలుంటున్నాయి. ఇలాంటి ఉదంతాలు చూసిన తర్వాత ఈ గడియకు క్షేమమని చెప్పుకొనే స్థితి వచ్చింది.
ఈ మధ్య కాలంలో పోలీస్ ఉద్యోగాల కోసమని దేహ దారుఢ్య పరీక్షకు హాజరై పరిగెత్తుతూ ఓ యువకుడు కన్నుమూశాడు. మరో అభ్యర్థి షార్ట్‌పుట్ ఈవెంట్‌లో పాల్గొని కింద కూర్చొని అలాగే నేలకొరిగాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఓ యువకుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ… ఛాతిలో నొప్పి ఉన్నట్లు గ్రహించి పక్కకు కూర్చొని నీళ్లు తాగి అలాగే నిలువునా కూలిన దృశ్యం అందరినీ కలచివేసింది. అలాగే.. దేశ వ్యాప్తంగా ప్రచారమైన కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తూ.. కుప్పకూలి కన్నుమూశాడు. అలాగే హాస్య నటుడు రాజు శ్రీవాత్సవ కూడా ఇలాగే కుప్పకూలాడు.
దీన్ని వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు. గుండెకు రక్తప్రసరణ నిలిచపోవటం ఫలితంగా మనిషి ఉన్న పలాన నేలకొరుగుతాడంటున్నారు. ఇది ఎవరిలో వస్తుంది? దీనికి ముందస్తు హెచ్చరికల లాంటివి ఏమీ మన శరీరంలో గమనించలేమా? ముందు జాగ్రత్తగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేమా లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనికి నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్ చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ ఓపీ యాదవ్ మొదలు అనేక మంది గుండె నిపుణులైన డాక్టర్లు చెప్తున్నదేమంటే.. హార్ట్ అటాక్‌కు ముందు శారీరకమైన కనీస మార్పులు ఉంటాయి. కానీ చాలా మంది తమ దైనందిన జీవితంలోని పనివత్తిడిలో పడి సున్నితమైన మార్పులను గమనించటం లేదు. తద్వారానే కార్డియాక్ అరెస్టుకు గురవుతున్నారని అంటున్నారు.
సాధారణంగా గుండె సంబంధిత సమస్య వచ్చేకంటే ముందు… మన శరీరం అసాధారణంగా చెమటలు పడుతుంది. ఛాతి వత్తి పట్టినట్లుగా, బరువుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. గుండె నుంచి భుజం వెనుక వైపుకు సన్నని నొప్పి ప్రసరిస్తున్న బాధ ఉంటుంది. కడుపులో ఉబ్బసంగా ఉంటుంది. చాలా మంది దాన్ని గ్యాస్ ట్రబుల్‌గా భావించి తేలికగా తీసుకొంటారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే తగు జాగ్రత్తగా వ్యవహరిస్తే.. కార్డియాక్ అరెస్టును తప్పించుకోవచ్చు. మన జీవిత కాలాన్ని సురక్షితంగా పొడిగించుకోవచ్చు.
ఎవరికైనా ఛాతిలో నొప్పి వచ్చి కుప్పకూలి తల్లడిల్లుతుంటే.. ప్రాథమిక చికిత్స అందేలోగా ఏమీ చేయలేమా.. అంటే చేయవచ్చు. అప్పటిదాకా ఉన్న శారీరక స్థితి నుంచి మొత్తంగా శరీరమంతా కంపించే స్థాయిలో ఏమైనా చేయాలి. ఉదాహరణకు.. గుండె నొప్పితో విలవిల్లాడుతున్న వ్యక్తికి పచ్చి మిరప కాయలు ఐదారింటిని నమిలిస్తే… మిరప మంటతో శరీరం నిలువెల్లా కంపిస్తుంది. దాంతో గుండె నొప్పినుంచి విముక్తి లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
హార్ట్ అటాక్ కు సంబంధించి నిర్దిష్ట కుటుంబ చరిత్ర చాలా ముఖ్యమైనది. ఒక కుటుంబంలో చిన్న వయస్సులోనే ఒకరు గుండె సంబంధిత వ్యాధితో చినిపోతే…, మిగతా వారు జాగ్రత్తగా ఉండాలి. అందరూ సంబంధిత పరీక్షలు చేసుకొని వైద్య సలహాలు, తగు చికిత్సలు పొందాలి.
ఈ మధ్యన కొవిడ్-19 వచ్చిన తర్వాత కరోనా బారిన పడిన వారిలో హార్ట్ అటాక్ సమస్య ఎక్కువగా ఉన్నదన్న ప్రచారం ఉన్నది. అందులో శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు. కాకుంటే.. చాలా మంది కరోనా బారిన పడిన సమయంలో స్టెరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటి మూలంగా కొన్ని విపరీతాలు లేక పోలేదు. కానీ కరోనానే కారణమని చెప్పటం సరియైనది కాదని నిపుణులైన వైద్యులు చెప్పటం గమనార్హం.