మీ శరీర భాగాలు పదిలమేనా? మార్కెట్లో దొరికేవి కావు..!
విధాత: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అంతేకాదు తిన్న ఆహారాన్ని అరిగించుకునే వారు. పడుకోగానే నిమిషాల్లో నిద్ర పోగలిగే వారికి మించిన అదృష్టవంతులు, కోటీశ్వర్లు ఈ లోకంలో లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా అంతా ఉరుకులు పరుగుల జీవితాన్నే గడుపుతున్నారు. ఈ హడావిడిలో ఒక్కోసారి తింటున్నామా.. లేదా అనేది గ్రహించడం లేదు. అలాగే ఏం తింటున్నాం.. అది ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా తినేస్తాం. ఒక్కోసారి అది కూడా చేయం. […]

విధాత: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అంతేకాదు తిన్న ఆహారాన్ని అరిగించుకునే వారు. పడుకోగానే నిమిషాల్లో నిద్ర పోగలిగే వారికి మించిన అదృష్టవంతులు, కోటీశ్వర్లు ఈ లోకంలో లేరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా అంతా ఉరుకులు పరుగుల జీవితాన్నే గడుపుతున్నారు. ఈ హడావిడిలో ఒక్కోసారి తింటున్నామా.. లేదా అనేది గ్రహించడం లేదు.
అలాగే ఏం తింటున్నాం.. అది ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా తినేస్తాం. ఒక్కోసారి అది కూడా చేయం. ఇలాంటి జీవన విధానం వల్ల శరీర అవయవాల పనితీరు ఎలా ఉంటుందనే ఊహే ఉండదు. మరి మనం తినే అలవాట్లు, తినే పదార్థాల వల్ల ఏ అవయవానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుంది. మన అవయవాలకి మనం శత్రవులమా.. మిత్రులమా తెలుసుకుందాం.
తిన్నా, తినకపోయినా రెండూ ప్రమాదమే..
మామూలుగా అయితే ఉదయం అల్పహారం తింటారు ఎవరైనా. అది ఒక్కొక్కరు ఒక్కో సమయంలో తింటారు. మరి కొంతమంది తినకుండానే రోజును ప్రారంభిస్తారు. ఇంకొంత మంది పండుగలు, శుభాకార్యాలప్పుడు ఇష్టమైనవని ఎక్కువగా తీసుకోవడం..
అలాగే వృధా అయిపోతుందని ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే జీర్ణాశయం ముప్పుతిప్పలు పడుతుంది. అసలు తినకపోయినా, అతిగా తిన్న రెండూ ప్రమాదమే. కాబట్టి అల్పాహారం తినడం, మితంగా తినడం మరవద్దు. ఒక రోజుకి పది గ్లాసుల నీరు తాగితేనే శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. లేదంటే మన కిడ్నీలు దెబ్బతింటాయి.
అవస్థలు పడుతున్న అవయవాలు
ఇక నిద్ర విషయానికి వస్తే ఆలస్యంగా పడుకోవడం.. ఆలస్యంగా లేవడం అలవాటుగా మారిపోయింది చాలా మందికి. కానీ ఇది ఆరోగ్య కరం కాదు. 11గంటల వరకు నిద్ర పోకపోయినా.. సూర్యోదయానికి ముందే మేల్కొనకపోయినా గాల్ బ్లాడర్ అనారోగ్యం పాలవుతుందట.
శరీరంలో చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు రెండు రకాలు ఉంటాయి. ఇవి ఏ ఆహార పదార్థాలు ఎలా తీసుకుంటే ఇబ్బంది పడతాయో తెలుసా. అతి చల్లని, పాచి పదార్థాలతో చిన్న ప్రేగులు, ఎక్కువ వేయించిన, కారం ఎక్కువ ఉన్న పదార్థాలతో పెద్ద ప్రేగులు అవస్థలకు గురవుతాయి.
లంగ్స్ అస్తవ్యస్తం.. ఇబ్బందిలో లివర్
కలుషిత వాతావరణంలో పొగ పీల్చుకున్నప్పుడు, సిగరెట్లు కాల్చే వారిలో, వారికి దగ్గరగా ఉన్న వారిలో లంగ్స్ అస్తవ్యస్తమవుతాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రైడ్ ఆహారం, జంక్ మరియు ఫాస్డ్ పుడ్ పదార్థాలు తినడం వల్ల లివర్ కి ఇబ్బందులు తప్పవు మరి
గుండె గుబేల్..
ఎక్కువ ఉప్పు, అధిక కొలెస్ట్రాల్ పదార్థాలు తీసుకుంటే గుండె గుభేల్ అంటుంది. డ్యాన్స్, వాకింగ్ చేస్తూ, పడుకున్న వారు పడుకున్నట్టే, కూర్చున్న వారు కూర్చున్నటే గుండె ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఎన్నో వినే ఉంటారు.. కాబట్టి గుండె పదిలంగా చూసుకుంటే పదికాలాలు హాయిగా జీవిస్తాం. తీపి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ప్యాంక్రియాస్ బారిన పడతాం.
ఆగం కానీకు..
నయనం ప్రధానం అంటారు. కళ్లు లేకపోతే ఏ పనీ సక్రమంగా చేయలేము. అంతటి విలువైన కళ్లతో రాత్రి పూట మొబైల్ ఫొన్, కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేస్తే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే కదా. శరీర భాగాల్లో అత్యంత ముఖ్యమైనది మెదడు. అలాంటి మెదడుకు ఆహారం సానుకూల ఆలోచనలు.. ప్రశాంత వాతావరణం. అలా కాకుండా ప్రతికూల ఆలోచనలు నింపేస్తే మెదడు పనితీరు దెబ్బతింటుంది. అప్పుడు శరీర వ్యవస్థే ఆగమాగమవుతుంది.
మీరూ కోటీశ్వరులే..
ఈ దేహం ప్రకృతి ప్రసాదించిన వరం. దేవుడి ఆలయం. అది తెలుసుకోకుండా చాలా మంది మేము పేదవారం, మధ్యతరగతి వారం అని ఇలా ఏవేవో మాట్లాడుతుంటారు. కానీ శరీర అవయవాలన్ని సక్రమంగా ఉన్న ప్రతి ఒక్కరూ ధనవంతులే.. కోటీశ్వరులే.
లక్షల విలువ చేసే పని..
అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరినప్పుడు ఒక్క రోజు లంగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు వసూలు చేస్తారు. అదే కిడ్నీలు చేసే పని డయాలిసిస్ చేస్తే 10వేలు, గుండె, లంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంకా మెదడుకి ప్రత్యామ్నాయం రాలేదు. వస్తే కోట్లల్లో ఉండొచ్చు. అంటే మెడికల్ పరిభాషలో రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది.
అలాంటి శరీరాన్నినిర్మించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా??
శరీరాన్నిఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేరే ఉదాహరణలు కావాలా.. పైన చెప్పిన శరీర అవయవాలన్ని మార్కెట్లో అందుబాటులో లేవు. కాబట్టి జాగ్రత్త వహించండి. శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండని చెప్తున్నారు విలువ తెలిసిన నిపుణులు.