Health tips | మైదా వంటకాలను అతిగా తింటున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

Health tips : చాలా మంది చపాతి, పరోట, రుమాలీ రోటి, తందూరీ రోటి లాంటి వాటిని ఇష్టంగా తింటుంటారు. అవి ఆరోగ్యానికి ప్రమాదం కాక‌పోయినా వాటి త‌యారీకి మైదాను ఎక్కువ‌గా వాడితే మాత్రం ముప్పు త‌ప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండ్లలో సంగ‌తి ఎలా ఉన్నా బ‌య‌ట హోట‌ళ్లు, టిఫిన్ సెంట‌ర్లలో మాత్రం మైదాను విప‌రీతంగా ఉప‌యోగిస్తుంటారు. మైదాపిండి గోధుమ పిండి కంటే త‌క్కువ ధ‌ర‌కు ల‌భించ‌డం, మైదాతో చేసే ప‌దార్థాలు తెల్లగా, రుచిగా ఉండ‌టం దాని అతి వినియోగానికి కార‌ణం.

Health tips | మైదా వంటకాలను అతిగా తింటున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

Health tips : చాలా మంది చపాతి, పరోట, రుమాలీ రోటి, తందూరీ రోటి లాంటి వాటిని ఇష్టంగా తింటుంటారు. అవి ఆరోగ్యానికి ప్రమాదం కాక‌పోయినా వాటి త‌యారీకి మైదాను ఎక్కువ‌గా వాడితే మాత్రం ముప్పు త‌ప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండ్లలో సంగ‌తి ఎలా ఉన్నా బ‌య‌ట హోట‌ళ్లు, టిఫిన్ సెంట‌ర్లలో మాత్రం మైదాను విప‌రీతంగా ఉప‌యోగిస్తుంటారు. మైదాపిండి గోధుమ పిండి కంటే త‌క్కువ ధ‌ర‌కు ల‌భించ‌డం, మైదాతో చేసే ప‌దార్థాలు తెల్లగా, రుచిగా ఉండ‌టం దాని అతి వినియోగానికి కార‌ణం. అయితే ఆరోగ్యానికి మంచిది కాదు కాబ‌ట్టి మైదా పిండితో చేసే ప‌దార్థాల‌ను తినే ముందు ఒక‌టికి రెండుసార్లు బాగా ఆలోచించాల‌ని హెల్త్ ఎక్స్‌ప‌ర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

మైదాపిండి ఎందుకు ప్రమాదక‌రం..?

మిల్లుల‌లో గోధుమ పిండిని బాగా పాలీష్ చేసి, వివిధ ర‌సాయనాల‌ను క‌లిపి మైదా పిండిని త‌యారు చేస్తారు. ఎక్కువ‌గా పాలిష్ చేయ‌డంవ‌ల్ల మైదాపిండికి మెత్తద‌నం, క్లోరైడ్ గ్యాస్‌, బైంజైల్‌ పెరాక్సైడ్ లాంటి ర‌సాయ‌నాల మిక్సింగ్‌వ‌ల్ల తెల్లద‌నం వ‌స్తాయి. ఈ ర‌సాయ‌నాలు ఆరోగ్యానికి హానిక‌రం. అందుకే చైనాతోపాటు, యూర‌ప్ దేశాలు బెంజైల్‌ పెరాక్సైడ్ వాడకంపై నిషేధం విధించాయి. మైదాలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే Alloxan అనే విషపూరితమైన రసాయనం కూడా ఉంటుంది.

మైదాతో వ‌చ్చే అన‌ర్థాలేమిటి..?

1. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత‌ పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచుప‌దార్థం జీరో. కాబట్టి మైదా త్వర‌గా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివ‌ల్ల పేగుల్లో పుండ్లు ప‌డే ప్రమాదం ఉన్నది. అవి ముదిరితే క్యాన్సర్ లాంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధుల‌కు దారితీస్తాయి.

2. మైదా పిండిని గోడ‌ల‌కు పోస్టర్లను అంటించ‌డానికి ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఎందుకంటే మైదాపిండిలోని జిగురు పోస్టర్లు గోడ‌కు గ‌ట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన ప‌దార్థాలను తిన్నప్పుడు అవి మ‌న పేగుల‌కు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్పత్తయ్యి ఇన్ఫెక్షన్‌ల‌ను క‌లుగ‌జేస్తాయి.

3. మైదాపిండివ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అంతేగాక మహిళలల్లో బ్రెస్ట్ సంబంధ‌ సమస్యలు ఉత్పన్నమ‌వుతాయి.

4. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండ‌టంవ‌ల్ల పొట్ట వ‌స్తుంది. ప్రొటీన్‌లు నామమాత్రంగా ఉంటాయి.

5. అదేవిధంగా మైదాలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివ‌ల్ల ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.