వయస్సుతో పాటు లింగత్వమూ మారుతుందా?
విధాత: స్త్రీ, పురుషుల్లో వయస్సు పెరిగే కొద్దీ లింగ లక్షణాల్లో మార్పు వస్తుందా.. అంటే అవుననే అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ మధ్య స్వీడన్‌కు చెందిన లింకోపింగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు స్త్రీ, పురుషుల్లో వయస్సు మీద పడుతున్న కొద్దీ వారిలో వస్తున్న మార్పులను శాస్త్రీయ అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో మహిళల్లో కన్నా పురుషుల్లోని జన్యువుల్లో వేగవంతమైన మార్పులు జరిగి స్త్రీ లక్షణాలు పెరుగుతున్నాయని తేలింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో పురుష లక్షణాల పెరుగుదల తక్కువగా ఉన్నట్లు […]

విధాత: స్త్రీ, పురుషుల్లో వయస్సు పెరిగే కొద్దీ లింగ లక్షణాల్లో మార్పు వస్తుందా.. అంటే అవుననే అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ మధ్య స్వీడన్‌కు చెందిన లింకోపింగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు స్త్రీ, పురుషుల్లో వయస్సు మీద పడుతున్న కొద్దీ వారిలో వస్తున్న మార్పులను శాస్త్రీయ అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనంలో మహిళల్లో కన్నా పురుషుల్లోని జన్యువుల్లో వేగవంతమైన మార్పులు జరిగి స్త్రీ లక్షణాలు పెరుగుతున్నాయని తేలింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో పురుష లక్షణాల పెరుగుదల తక్కువగా ఉన్నట్లు తేలింది.
ఆడ, మగ లింగ భౌతిక భేదంతో జన్మించిన శిశువులు పెరుగుతున్న క్రమంలో వారిలో లింగభేదంతో పాటు స్వాభావిక లక్షణాలు కూడా ఏర్పడుతాయి. బాల, బాలికల నడత, మాటలో తేడా వస్తుంది. ఆ క్రమంలో కౌమార దశ నుంచి యవ్వన దశలో అడుగుపెట్టే నాటికి శారీర లక్షణాల్లో విస్పష్ట తేడా ఏర్పడుతుంది. లింగ స్పందనలకు ప్రధాన భూమిక మెదడే అయినా.., సామాజిక విషయాలు లింగ లక్షణాల్లో ముఖ్య భూమిక పోషిస్తాయి.
అయితే.. వయస్సు మీద పడి వృద్ధాప్యం దరి చేరే సరికి లింగ స్వాభావిక లక్షణాల్లో గణనీయ మార్పులు రావటం ఓ సహజ ప్రక్రియగా కొనసాగుతుంది. దీన్ని చాలా మంది అర్థం చేసుకోలేక వృద్ధాప్యంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వచ్చే మాటలు, చేష్టలను ఈసడించుకోవటం జరుగుతుంది. ఈ విషయాలను మానవీయంగా అర్థం చేసుకున్నప్పుడే పెద్దలను ఆదరించగలుగుతామని గుర్తించాలి.