Tears | కన్నీరు ఆగడం లేదా..? మనసారా ఏడవండి..! కన్నీరు కూడా ఆరోగ్యానికి మంచిదేనటా..?

Tears | నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే, కానీ కన్నీళ్లు పెట్టుకున్నా మంచిదేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మనిషి భావోద్వేగాల్లో ఏడవడం కూడా ఒకటని.. శారీరక.. మనసులో గూడుకట్టుకున్న ఆవేదన కన్నీటితో బయటకు వ్యక్తపరుస్తుంటారని నిపుణులు పేర్కొంటున్నారు.

Tears | కన్నీరు ఆగడం లేదా..? మనసారా ఏడవండి..! కన్నీరు కూడా ఆరోగ్యానికి మంచిదేనటా..?

Tears | నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే, కానీ కన్నీళ్లు పెట్టుకున్నా మంచిదేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మనిషి భావోద్వేగాల్లో ఏడవడం కూడా ఒకటని.. శారీరక.. మనసులో గూడుకట్టుకున్న ఆవేదన కన్నీటితో బయటకు వ్యక్తపరుస్తుంటారని నిపుణులు పేర్కొంటున్నారు. బాధలో కన్నీరు పెట్టుకున్న వారు ఆ తర్వాత కొద్దిసేపటికి తేరుకుంటారని.. మానసికంగా కొంత ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. దీనికి కారణంగా ‘కన్నీరు వచ్చిన సమయంలో పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థ యాక్టివేట్‌కావడంతో ఎండార్ఫస్‌ను విడుదల చేస్తుంది. దాంతో ఆ బాధ నుంచి తేరుకుంటారు’ అని నిపుణులు పేర్కొంటున్నారు. తట్టుకోలేని బాధ కలిగినా.. పట్టలేనంత సంతోషం కలిగిన సందర్భాల్లోనూ కంటి నుంచి కన్నీరు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఓదార్పును కోరుకునేందుకు మనుషులు వ్యక్తం చేసే మూగ భాషే కన్నీరని.. దాంతో సామాజిక బంధాలు మెరుగుపడుతాయని నిపుణులు చెప్పారు. అయితే, కన్నీరు పెట్టుకోవడంతో పలు లాభాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఎవరైనా బాధలో ఉన్న సమయంలో తమకు తాముగా దాన్ని నుంచి తేరుకునేందుకు కన్నీరు ఉపయోగపడుతుంది. పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థ స్పందించి విడుదల చేసే ఎండార్పిన్స్‌తో శరీరం ఉపశమనం పొందుతుంది. దాంతో శారీరక, మానసిక నొప్పి నుంచి బయటపడుతారు. ఒత్తిడి తగ్గి.. నిరాశ కొంత వరకు దూరమవుతుంది. అలాగే మానసిక స్థితి మార్పునకు దోహదం చేయడంతో పాటు హాయిగా నిద్రపోతారు. దాంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కంటిచూపు సైతం మెరుగుపడుతుందని.. కళ్లు పొడిబారే సమస్య తగ్గుతుందని, కళ్లలోకి చేరిన దుమ్ముధూళి బయటకు వెళ్తుందని పేర్కొన్నారు. దాంతో కంటి ఇన్ఫెక్షన్‌ నుంచి దూరంగా ఉంటారన్నారు.

పిల్లలు ఏడవడంతో శ్వాస తీసుకునేందుకు సాయపడుతుందని వైద్యులు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువును సున్నితంగా కొట్టి ఏడిపించడానికి కారణాలు ఇవేనని చెప్పారు. ఇలా చేయడం వల్ల పిల్లలు శ్వాస పీల్చే వేగం పెరగడంతో పాటు శరీరానికి మరింత ఆక్సిజన్‌ అందుతుందని వివరించారు. అయితే, కన్నీరు పెట్టుకోవడం మంచిదే అయినా.. అది ఎంత సమయమనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. ఒక్కొక్కరి పరిస్థితి, శారీరక.. మానసిక స్థితి ఒక్కోలా ఉంటుందని.. దాంతో ఇంతసేపే ఏడవాలని చెప్పలేమన్నారు. పరిస్థితులు, బాధ తీవ్రత, వేధనను బట్టి సమయం, విధానాలు మారుతాయని చెప్పారు. ఈ విషయంపై అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలను నిపుణులు బటయపెట్టారు. సగటున ప్రతీ అమెరికన్ మహిళ నెలలో 3.5 సార్లు ఏడుస్తుందని.. అదే అమెరికన్ పురుషులు సగటున నెలకు 1.9 సార్లు మాత్రమే ఏడుస్తారన్నారు. అదే చైనా మహిళలైతే నెలలో సగటున 1.4 సార్లు మాత్రమే ఏడుస్తారని వివరించారు.