ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థినులకు సన్మానం
విధాత: సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్ కు చెందిన ఇద్దరు పద్మశాలి విద్యార్థినులు 2022 నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు తెచ్చుకొని సిద్దిపేట మెడికల్ కళాశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు అభినయ, మచ్చ కీర్తిని కౌన్సిలర్లు రాపల్లి విఠోబా, బింగి రాజేశం, పద్మశాలి సంఘం అధ్యక్షుడు స్. విఠల్ సోమవారం సన్మానించారు. మంచి ప్రతిభ కనబరిచి స్థానికంగా ఉన్న సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు సాధించడం అభినందనీయమని పలువురు అభినందించారు. పట్టుదలతో చదివి మంచి […]

విధాత: సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్ కు చెందిన ఇద్దరు పద్మశాలి విద్యార్థినులు 2022 నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు తెచ్చుకొని సిద్దిపేట మెడికల్ కళాశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు అభినయ, మచ్చ కీర్తిని కౌన్సిలర్లు రాపల్లి విఠోబా, బింగి రాజేశం, పద్మశాలి సంఘం అధ్యక్షుడు స్. విఠల్ సోమవారం సన్మానించారు.
మంచి ప్రతిభ కనబరిచి స్థానికంగా ఉన్న సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు సాధించడం అభినందనీయమని పలువురు అభినందించారు. పట్టుదలతో చదివి మంచి ఉత్తీర్ణత సాధించారు అదేవిధంగా ఉత్తమ డాక్టర్లుగా రాణించాలని వారు కోరారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం ప్రతినిధులు నరసయ్య, గురు, శ్రీనివాస్, సత్యం, వెంకన్న, నగెష్ నాగరాజు, నరేందర్, నవీన్, విద్యార్థినుల బంధువులు పాల్గొన్నారు.