చలికాలంలో చర్మ రక్షణ ఎలా అంటే..?
విధాత: వేసవి, వర్షాకాలంతో పోల్చితే చలి కాలంలో చర్మ రక్షణకు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ కాలంలో చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో చర్మం పొడిబారడం, పగుళ్లు, దురద తదితర సమస్యలు చికాకు తెప్పిస్తాయి. మరి అలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. గాఢత తక్కువ ఉన్న సబ్బును ఉపయోగిస్తే చర్మానికి తక్కువ హాని కలుగుతుంది. అలాగే మాయిశ్చరైజర్ అప్లై చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. తద్వారా చర్మం […]

విధాత: వేసవి, వర్షాకాలంతో పోల్చితే చలి కాలంలో చర్మ రక్షణకు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ కాలంలో చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో చర్మం పొడిబారడం, పగుళ్లు, దురద తదితర సమస్యలు చికాకు తెప్పిస్తాయి. మరి అలాంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
- గాఢత తక్కువ ఉన్న సబ్బును ఉపయోగిస్తే చర్మానికి తక్కువ హాని కలుగుతుంది. అలాగే మాయిశ్చరైజర్ అప్లై చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. తద్వారా చర్మం పొడిబారడం, పగుళ్లు, దురద తదితర సమస్యలను దరికి రానీయకుండా చేయవచ్చు.
- చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో తేమ శాతం తక్కువ కాకుండా చూసుకోవాలి. వేసవిలోనే కాదు శీతాకాలంలోనూ నీళ్లు బాగా తాగాలి. అప్పుడే చర్మం హైడ్రేట్ అయి చర్మ సమస్యలు రాకుండా రక్షణ పొందుతుంది.
- మనం తీసుకునే ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పై పదార్థాలు, జంక్ పుడ్ తదితరాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. తాజా ఆకు కూరల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకు కూరలను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. తద్వార చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
- తాజా పండ్లు, కూరగాయలు కూడా శరీరానికి రక్షణ ఇస్తాయి. ముఖ్యంగా యాపిల్, దానిమ్మ, చెర్రీస్, స్ట్రాబెర్రీ తదితర పండ్లు, దోసకాయ, బెండకాయ, బీట్‌రూట్ వంటి కూరగాయలను తీసుకోవడం మరవద్దు.
- చలికాలంలో ఎక్కువ సమయం స్నానం చేయడం, బాగా రుద్దడం, నురుగు రావాలని ఎక్కువ సబ్బుతో స్నానం మంచిది కాదు. అంతేకాదు స్నానం చేశాక తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ లేదా నూనె రాస్తే చర్మం బాగా గ్రహిస్తుంది. చర్మంపై పగుళ్లు ఏర్పడవు.
- మరో ముఖ్య విషయం చల్లగా ఉంది కదా అని స్నానానికి ఎక్కువ వేడి నీటిని ఉపయోగించవద్దు. గోరువెచ్చని నీటితో స్నానం ఆరోగ్యకరం.. చర్మానికి రక్షణ.
- అలాగే చాలా వేడి నీటిని ఉపయోగించకూడదు.ఎక్కువసేపు నీటిలో ఉండకూడదు. శరీరాన్ని ఎక్కువగా రుద్ద కూడదు. అంతేకాదు స్నానం చేసిన తర్వాత తడిగ ఉన్నచర్మంపై మాత్రమే మాయిశ్చరైజర్ లేదా నూనెను రాస్తే అది బాగా గ్రహించబడుతుంది.
- ఈ కాలంలో కూడా ఎండలో బయటకు వెళ్లినా లేదా ఇంట్లోనే ఉన్నా సన్‌స్క్రీన్ రాయడం తప్పనిసరి. ఏ కాలంలోనైనా యూవీ కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి.
నోట్: ఈ సలహాలు మీ అవగాహన కోసం మాత్రమే . సందేహాలు ఉంటే నిపుణుల సలహా తీసుకోవాలి.