Fennel Seeds | షుగర్‌ పేషెంట్‌లు రోజూ సోంపును ఇలా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి..!

Fennel Seeds : మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి మధుమేహం, బీపీ సమస్యలు వస్తున్నాయి. పది మందిలో నలుగురికి మధుమేహం వస్తోంది. ఈ మధుమేహం ఎక్కువైతే ప్రాణాంతకంగా మారుతుంది. మన శరీరంలోని అవయవాలను ఒక్కొక్కటిగా దెబ్బతీసి చివరకు ప్రాణాలను హరిస్తుంది.

అయితే ఒకసారి షుగర్ వచ్చిందంటే ఇక తగ్గించుకోవడం చాలా కష్టమని అనుకుంటారు. కానీ అది తప్పు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తే షుగర్‌ను పూర్తిగా తగ్గించుకోలేకపోయినా అదుపులో మాత్రం ఉంచుకోవచ్చు. మధుమేహాన్ని సోంపు బాగా కంట్రోల్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి సోంపును ఎన్ని విధాలుగా తీసుకోవచ్చో చూద్దాం..

సోంపు నీళ్లు

సోంపు వాటర్‌తో డయాబెటిక్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడానికి క్రమం తప్పకుండా సోంపు వాటర్ తాగాలి. ఒక టేబుల్ స్పూన్ సోంపును ఒక గ్లాస్‌ నీటిలో కలుపుకుని తీసుకోవాలి. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు సోంపు వాటర్‌ రెడీ చేసి పెట్టుకుని, ఉదయాన్నే పరిగడుపున తాగాలి. నీళ్లలో నానిన సోంపును కూడా నమిలి మింగేయాలి. ఇలా నిత్యం చేస్తే కచ్చితంగా షుగర్ కంట్రోల్ అవుతుంది.

సోంపు టీ

సోంపును నీటిలో కలిపి తాగడం ఇష్టంలేని వాళ్లు దాన్ని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిని వేడిచేసి అందులో ఒక చెంచా సోంపు వేయాలి. అనంతరం దాన్ని ఫిల్టర్ చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తాగేయాలి. రోజు ఇలా చేస్తే మధుమేహం అదుపులోకి రావడం ఖాయం.

సోంపును నేరుగా తినడం

చాలా మందికి సోంపు తినడం అలవాటే. షుగర్ ఉన్న వాళ్లు సోంపు తింటే త్వరగా అదుపులోకి వస్తుంది. రోజులో నాలుగు సార్లు ఏదైనా తిన్న తర్వాత సోంపును నమిలి మింగాలి. ఇలా తరచూ చేస్తే కచ్చితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో పాటే రక్తంలో షుగర్‌ స్థాయిలు కూడా కంట్రోల్ అవుతాయి.