రోజూ స్నానం చేస్తే ప్రమాదమట!
విధాత: ప్రతి రోజూ స్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు వేసుకోవాలి అని పరిసరాల విజ్ఞానంలో చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటాం అందరం. ఎప్పుడైనా స్నానానికి ఆలస్యం అయినా విసుగ్గా కూడా అనిపిస్తుంది. స్నానం చేశాక ఒక రకమైన రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది కూడా. మరి రోజూ స్నానం చెయ్యడం మంచిదేనా? ఇదేం ప్రశ్న స్నానం చేసి శుభ్రంగా ఉండడం కూడా మంచిదేనా అని అడొగొచ్చా అని ఆవాక్కవుతున్నారా? మరి నిపుణుల మాటలు అలా అవాక్కయ్యేలా ఉన్నాయి. […]

విధాత: ప్రతి రోజూ స్నానం చేసి శుభ్రమైన ఉతికిన బట్టలు వేసుకోవాలి అని పరిసరాల విజ్ఞానంలో చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటాం అందరం. ఎప్పుడైనా స్నానానికి ఆలస్యం అయినా విసుగ్గా కూడా అనిపిస్తుంది. స్నానం చేశాక ఒక రకమైన రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది కూడా. మరి రోజూ స్నానం చెయ్యడం మంచిదేనా? ఇదేం ప్రశ్న స్నానం చేసి శుభ్రంగా ఉండడం కూడా మంచిదేనా అని అడొగొచ్చా అని ఆవాక్కవుతున్నారా? మరి నిపుణుల మాటలు అలా అవాక్కయ్యేలా ఉన్నాయి. అసలు స్నానం కథా కమామిషు ఒక సారి చూద్దాం.
చెయ్యాలా? వద్దా?
అందరం రోజూ ఒక్కసారైనా స్నానం తప్పకుండా చేస్తాం. కొందరైతే రెండు పూటలా స్నానం చేస్తారు. అయితే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ కు చెందిని నిపుణులు మాత్రం వద్దని అంటున్నారు. రోజూ స్నానం చెయ్యడం అంత ముఖ్యమైన విషయమేమీ కాదని ఇక్కడి ప్రొఫెసర్ సాలీ బ్లూమ్ ఫీల్డ్ పేర్కొన్నారు.
సామాజిక అంగీకారం కోసం మాత్రమే మనం స్నానం కంపల్సరీ అనుకుంటాం కానీ అంత ముఖ్యమేమీ కాదని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయం వెలిబుచ్చారు. మన శరీరానికి ఉండే ఒక ప్రత్యేకమైన వాసన పక్కన వారికి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి స్నానం చెయ్యడం మనకు అలవాటవుతుందని ఈయన ఉద్దేశం.
మన శరీరం చాలా రకాల సూక్ష్మ జీవులకు ఆవాసం. ఇవి చర్మం ఉత్పత్తి చేసే నూనె స్థాయిని కంట్రోల్ చేస్తాయట. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహజమైన ఏర్పాటట. అయితే మనం స్నానం చెయ్యడం వల్ల ఇవన్నీ కూడా తొలగిపోతాయి. నిజానికి మనకు మనకు పెద్దగా అవసరం లేదని లండన్ నిపుణులు అంటున్నారు.
పెద్ద నష్టమేమీ లేదు
శరీరం మీద నివసించే ఈ సూక్ష్మ జీవుల వల్ల శరీరం నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. అదే మనకు అసౌకర్యంగా ఉండే విషయం. అందకే స్నానం చెయ్యాలని అనిపిస్తంది కానీ ఆరోగ్యానికి పెద్ద ఉపయోమగం ఏమీ లేదు. లాభం లేక పోగా స్నానం వల్ల నష్టాలున్నాయని అంటున్నారు.
ప్రతి రోజూ స్నానం చేస్తే నష్టం చేసే బ్యాక్టీరియా శరీరం మీద దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. పొడి చర్మం ఉన్న వారు చలికాలంలో చాలా ఇబ్బంది పడతారని, తరచుగా స్నానం చెయ్యడం వల్ల చర్మం మీద పగుళ్లు ఏర్పడుతాయని, అందువల్ల హాని చేసే బ్యాక్టీరియా శరీరం లోపలికి సులభంగా ప్రవేశిస్తుందని నిపుణులు అంటున్నారు.
నిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు
మన శరీరంలోని నిరోధక వ్యవస్థ అప్రమత్తంగా ఉండేందుకు తరచుగా కొంత అపరిశుభ్ర పరిసరాలకు, కొన్ని సూక్ష్మ జీవులకు ఎక్స్ పోజ్ అవుతూ ఉండడం అవసరం. ఇలా జరిగినపుడు ఇందుకు తగిన యాంటీ బాడీలను శరీరం ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ ఉంటుంది.
అందుకే పసి పిల్లలకు ప్రతి రోజూ స్నానం అవసరం లేదని పిల్లల వైద్యులు చెబుతుంటారు. జీవిత పర్యంతం ప్రతి రోజూ స్నానం చెయ్యడం వల్ల పని తగ్గి నిరోధక వ్యవస్థ బద్ధకిస్తుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ కు చెందిని డాక్టర్ రాబర్ట్ హెచ్. షెమర్లింగ్ పేర్కొన్నారు.
ఇక మెడికేటేడ్ సోపులు, ఇతర బాడీ వాష్ల వినియోగం వల్ల చర్మం పొడి బారడం మాత్రమే కాదు శరీరం మీద ఉండే అన్ని రకాల బ్యాక్టీరియాలు నశిస్తాయని, ఇందులో అవసరమైన బ్యాక్టీరియాను కూడా శరీరం నష్టపోతుందని అన్నారు. సో మనం స్నానం చేయడంలో ఒక పూట, ఒక రోజు అటు ఇటైనా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు.