సంతాన సాఫల్య సమస్యల్లో ఆపోహల పాత్ర?

విధాత‌: సాధారణ దాంపత్య జీవితం గడుపుతూ, ఎలాంటి గర్భనిరోధక జాగ్రత్తలు పాటించకుండా పెళ్లయి ఏడాది గడిచిన తర్వాత కూడా గర్భం దాల్చకపోతే వారికి సంతాన సాఫల్య సమస్యలు ఉన్నట్టుగా పరిగణిస్తారు. రోజులు చాలా మారిపోయాయి. ఎంతో శాస్త్రపరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ యువ దంపతుల్లో సంతాన సాఫల్యం గురించిన అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన అపోహలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సమస్యలు చిన్నవే అయినా సమయానికి చికిత్స తీసుకోక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాంటి కొన్ని […]

సంతాన సాఫల్య సమస్యల్లో ఆపోహల పాత్ర?

విధాత‌: సాధారణ దాంపత్య జీవితం గడుపుతూ, ఎలాంటి గర్భనిరోధక జాగ్రత్తలు పాటించకుండా పెళ్లయి ఏడాది గడిచిన తర్వాత కూడా గర్భం దాల్చకపోతే వారికి సంతాన సాఫల్య సమస్యలు ఉన్నట్టుగా పరిగణిస్తారు. రోజులు చాలా మారిపోయాయి. ఎంతో శాస్త్రపరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటికీ యువ దంపతుల్లో సంతాన సాఫల్యం గురించిన అనుమానాలు ఉంటూనే ఉన్నాయి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన అపోహలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సమస్యలు చిన్నవే అయినా సమయానికి చికిత్స తీసుకోక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అలాంటి కొన్ని విషయాలు ఇక్కడ చర్చించుదాం.

అందువల్ల చిన్న సమస్యలైనా చికిత్స తీసుకోవడంలో ఆలస్యం జరిగి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి కొన్ని అపోహలను గురించి ఇక్కడ ఒకసారి చర్చించుదాం.

అపవాదు భార్య మీదేనా?

చాలా సందర్భాల్లో పిల్లలు కలగక పోవడానికి కారణం స్త్రీల మీదే వేస్తుంటారు. లోకమంతా అన్ని సమాజాల్లో ఈ రకమైన నమ్మకం ఉంది. కానీ సంతానం కలగక పోవడానికి పురుషుల్లో కూడా లోపం కారణం కావచ్చు. లేదా ఇద్దరిలోనూ సమస్య ఉండి ఉండవచ్చు. ప్రతి సారీ కేవలం భార్యల్లోనే సంతాన సంబంధ లోపాలు ఉంటాయని అనుకోవడం ఒక ఆపోహ మాత్రమే.

పిల్లలను కనగలిగే బాధ్య‌త‌ కేవలం స్త్రీలకు మాత్రమే అనుకుంటూ ఉంటారు. పురుషులు ఏ వయసులోనైనా పిల్లలను పుట్టించగలరనే అపోహ ఉంది. నిజానికి అటువంటిదేమీ ఉండదు. పురుషుల్లో కూడా 40 సంవత్సరాల వయసు తర్వాత వీర్య పరిమాణం, కణాల్లో చురుకుదనం కూడా తగ్గిపోతుంది.

వయసు చాలా ముఖ్యం

మనం ముందు చెప్పుకున్నట్టు కనీసం ఏడాది పాటు ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే ఫెర్టిలిటి సమస్యలు ఉన్నదీ లేనిదీ తెలుస్తుందనేది కూడా ఒక అపోహ మాత్రమే. దంపతుల వయసు 35 సంవత్సరాల కంటే తక్కువగా ఉండి, ఎలాంటి అనారోగ్యాలు లేనపుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. పిసీఓడి, ఎండోమెట్రియాసిస్, క్రమబద్ధమైన పీరియడ్ సైకిల్ ఇలా ఎన్నో విషయాలు సంతాన సాఫల్యం మీద ప్రభావం చూపుతాయి. ఒకవేళ దంపతుల వయసు 35 కంటే ఎక్కువ ఉంటే మాత్రం 6 నెలల్లో డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

కాంట్రాసెప్టివ్స్

ఇప్పుడే పిల్లలు వద్దనుకునే వారు రకరకాల నిరోధక పద్ధతులను పాటిస్తారు. అందులో గర్భనిరోధక మాత్రలు వాడటం ఒక పద్ధతి. ఇవి వాడి, మానేసిన తర్వాత కూడా పిల్లలు కలగరేమో అని నమ్ముతారు. అది పూర్తిగా తప్పు. నిజానికి ఏవైనా హార్మోనల్ సమస్యలు ఉంటే వీటి వల్ల సరిచేయబడతాయి. రుతు చక్రం ఒకసారి క్రమబద్ధీకరించబడితే ఇక మాత్రలు మానేసిన వెంటనే గర్భం దాల్చేందుకు మార్గం సుగమం అవుతుంది.

ఇతర అనారోగ్యాల వంటిదే

సంతానం కలగడం వేరు, ఇతర ఆరోగ్యం వేరు అనుకుంటారు. కానీ చాలా రకాల అనారోగ్యాలు సంతాన సాఫల్యం మీద ప్రభావం చూపుతాయి. సరైన జీవన శైలి లేకపోవడం, ఎక్కువ బీఎంఐ, సెడంటరీ లైఫ్ స్టైల్ వంటివన్నీ తప్పకుండా పిల్లలు కలగపోవడానికి కారణం కావచ్చు.

అపోహలు తీరితే చికిత్స తీసుకోవడం సులభం అవుతుంది. కనుక ముందుగా మన నమ్మకాల్లో నిజాలు ఏమిటో తేల్చుకోవడం అవసరం.