సుస్తీ పోగొట్టేందుకు.. బస్తీ దవాఖాన: మంత్రి జగదీష్‌రెడ్డి
ఆరోగ్య తెలంగాణ కోసం చర్యలు సర్కార్ వైద్యంపై ప్రజలకు పెరుగుతున్నవిశ్వాసం విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: వైద్య రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో నే ప్రజలకు ప్రభుత్వ వైద్యం పై విశ్వాసం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో 1వ వార్డ్ కుడకుడలో బస్తీ దవాఖానను గురువారం మంత్రి ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యంతో పాటు మందులు కూడా.. బస్తీలలో సుస్తీని పొగొట్టేందుకే బస్తీ దవాఖానలు ఏర్పాటు […]

- ఆరోగ్య తెలంగాణ కోసం చర్యలు
- సర్కార్ వైద్యంపై ప్రజలకు పెరుగుతున్నవిశ్వాసం
విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: వైద్య రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలతో నే ప్రజలకు ప్రభుత్వ వైద్యం పై విశ్వాసం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో 1వ వార్డ్ కుడకుడలో బస్తీ దవాఖానను గురువారం మంత్రి ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
వైద్యంతో పాటు మందులు కూడా..
బస్తీలలో సుస్తీని పొగొట్టేందుకే బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు పేదలకు వారి బస్తీలలోనే ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఉంటుందని అన్నారు. బస్తీ దవాఖానల ద్వారా మంచి వైద్యంతో పాటు పైసా ఖర్చు లేకుండా వైద్యం, 120 రకాల పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా అందజేస్తారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం, పేద ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు..
బస్తీ దవఖానాల్లో డాక్టర్, నర్స్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని తెలిపారు. 2014 కు ముందు గత పాలకుల హయాంలో చిన్న చిన్న రోగాలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడేవారు. అలాగే ప్రజలు అనేక అంటు వ్యాధులతో ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. అయితే కేసీఆర్ సీఎం అయ్యాక ఆరోగ్య స్థితి గతుల విషయంలో ఎంతో అభివృద్ధి జరిగిందని మంత్రి అన్నారు. ఎక్కడి కక్కడ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని కొనియాడారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా పరుగులు
గతం లో ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలంటే ఆమడ దూరం పారిపోయే రోజుల నుండి ప్రసూతి అంటే ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్ళాలనుకునే విధంగా వైద్యం రంగం అభివృద్ధి జరిందన్నారు. మండల కేంద్రాల్లో, మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిత్యం పెరుగుతున్న రోగుల తాకిడే ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు ఉన్ననమ్మకానికి నిదర్శం అని మంత్రి అన్నారు.
వైద్యం, విద్య విషయంలో ఏ సమాజం అయితే ముందు ఉంటదో ఆ సమాజానికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైద్య రంగం కోసం చేపట్టిన అనేక పథకాలు, చర్యలతో రాష్టం ఆరోగ్య తెలంగాణ దిశగా పరుగులు పెడుతుందన్నారు.
ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరూ బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపు నిచ్చారు. అనంతరం బస్తీ దవాఖానలో మంత్రి జగదీష్ రెడ్డి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది బిక్షం, గుర్రం సత్యనారయణ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.