ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీకి మెటా షాక్‌ ఇచ్చింది. కంటెంట్‌ పాలసీని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా అకౌంట్లను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది

  • ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా అకౌంట్లు బ్యాన్‌

Meta | ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనికి మెటా కంపెనీ షాక్‌ ఇచ్చింది. కంటెంట్‌ పాలసీని ఉల్లంఘించినందుకు ఆయన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. పాలసీని ఉల్లంఘించినందుకు అకౌంట్స్‌ను తొలగించినట్లు మెటా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి మెటా ప్రస్తావించనప్పటికీ, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడిని ఖమేనీ సమర్థించారు.

అయితే, ఇరాన్‌ ప్రమేయాన్ని ఖండించారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడికి, ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు నౌకలపై దాడులకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రతీకార చర్యలకు ఆయన బహిరంగంగా మద్దతు పలికారు. ఇరాన్‌లో 35 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఖమేనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచానికి హానిని నివారించేందుకు, అంతరాయం కలిగించే ప్రయత్నంలో హింసాత్మక మిషన్లను ప్రకటించే, హింసకు పాల్పడే సంస్థలు, వ్యక్తుల ఉనికిని తమ ప్లాట్‌ఫామ్‌లలో అనుమతించమని మెటా స్పష్టం చేసింది.

పాలసీ ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. హమాస్‌ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిందని మెటా పేర్కొంది. ఇరాన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా నిషేధించారు. అయితే, ఇరానియన్స్‌ ఆంక్షలను అధిగమిస్తూ నిషేధిత వెబ్‌సైట్లు, అనువర్తాలను వినియోగించేందుకు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్స్‌, వీపీఎన్‌లను ఉపయోగిస్తూ వస్తున్నారు.

Updated On 9 Feb 2024 5:20 AM GMT
Somu

Somu

Next Story