జనసేనలోకి అంబటి రాయుడు..పవన్ కల్యాణ్‌తో భేటీ

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఆయన జనసేనలో చేరనున్నారు. ఇటీవలే సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు పదిరోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా ఐసీఎల్ క్రికెట్ టొర్నమెంట్ కోసం తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. ఇంతలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారని, గుంటూరు ఎంపీగా పోటీ చేయవచ్చని తెలుస్తుంది.