జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ముగ్గురు బాలిక‌లు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు.

  • అగ్నిప్ర‌మాదంలో సజీవ ద‌హ‌నం
  • జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాంబ‌న్ జిల్లాలో దారుణం

విధాత‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ముగ్గురు బాలిక‌లు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. నిద్ర‌లో ఉండ‌గానే ఈ దారుణం జ‌రుగ‌డంతో వారు శాశ్వ‌త నిద్ర‌లోకి వెళ్లారు. వారి మృతదేహాలను అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది క‌నుగొన్నారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం..

రాంబన్ జిల్లా ఉఖ్రాల్ బ్లాక్‌లోని ధన్మస్తా-తజ్నిహాల్ గ్రామంలోని మూడంతస్తుల భ‌వనంలో సోమ‌వారం తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. ఇంట్లో మంటలు చెలరేగడంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు టీనేజ్ అక్కాచెల్లెళ్లు సజీవదహనమయ్యారు.


ఇల్లు మొత్తం మంటలు వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయారు. మృతుల‌ను బిస్మా (18), సైక (14), సానియా (11) గా గుర్తించారు. వారి మృతదేహాలను అగ్నిమాపక మరియు అత్యవసర సేవల సిబ్బంది కనుగొన్నారు, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Somu

Somu

Next Story