8వ లోక్‌సభకు ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. అధికార ఎన్డీయే, ప్రధాన ప్రతిపక్ష కూటమి ఇండియా మధ్య పోరు కేంద్రీకృతమై ఉన్నది.

  • 18వ లోక్‌సభను ఎన్నుకోనున్న ప్రజలు
  • ఏప్రిల్‌-మే నెలల్లో పోలింగ్‌ ఉండే అవకాశం
  • పోటీ ప్రధానంగా ఎన్డీయే-ఇండియా కూటమి మధ్యే

న్యూఢిల్లీ: 18వ లోక్‌సభకు ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. అధికార ఎన్డీయే, ప్రధాన ప్రతిపక్ష కూటమి ఇండియా మధ్య పోరు కేంద్రీకృతమై ఉన్నది. ప్రస్తుతం ఉన్న 17వ లోక్‌సభ పదవీకాలం 2024 జూన్‌ 16తో ముగియనున్నది. ఈలోపు కొత్త ప్రభుత్వం ఎన్నికవ్వాల్సి ఉన్నది. ఎన్నికల షెడ్యూల్‌ ఇంకా విడుదల కానప్పటికీ.. ఆయా పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయే 353 సీట్లు గెలుచుకున్నది. బీజేపీ సొంతగా 303 స్థానాల్లో విజయం సాధించింది. అంటే.. మెజార్టీకి అవసరమైన 272 సీట్లకంటే 31 స్థానాలు అధికంగా గెలుచుకున్నది.

2024 లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు?

సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటన జారీ చేయలేదు. అయితే.. ఈ విషయంలో అనేక ఊహగానాలు సాగుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చిమొదటివారంలో ఎన్నికల సంఘం నుంచి ప్రకటన వస్తుందని, ఏప్రిల్‌- మే నెలల్లో పోలింగ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఎన్ని దశల్లో పోలింగ్‌?

2014 లోక్‌సభ ఎన్నికలు 9 దశల్లో నిర్వహించగా, తర్వాత 2019 ఎన్నికల్లో వాటిని ఏడు దశలకు కుదించారు. ఇప్పుడు కూడా 9 లేదా 7 దశల్లోనే ఎన్నికలు ఉంటాయన్న చర్చ ఈసీ వర్గాల్లో నడుస్తున్నది. అయితే.. ఈసీ ప్రకటతోనే దీనిపై స్పష్టత రానున్నది.

ఓటర్లు ఎంత మంది?

2019 ఎన్నికల్లో దేశం మొత్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో దాదాపు 1.50 కోట్లమంది కొత్తగా ఓటు హక్కు పొందినవారే. ఈ ఏడాది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య ఆరు కోట్ల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం 96 కోట్ల మంది అర్హులైన ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.

ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు

అధికార ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీ బీజేపీ అయినప్పటికీ.. చిన్నాచితక పార్టీలు అన్నీ కలుపుకొని 36 ఉన్నాయి.

భారతీయ జనతా పార్టీ (బిజెపి)

నేషనల్ పీపుల్స్ పార్టీ

శివసేన (ఏక్‌నాథ్ షిండే)

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్)

జనతాదళ్ (సెక్యులర్)

జనతాదళ్ (యునైటెడ్)

లోక్ జనశక్తి పార్టీ

రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ

హిందుస్థానీ అవామ్ మోర్చా

రాష్ట్రీయ లోక్ జనతాదళ్

ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్

అసోం గణ పరిషత్

యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్

అప్నా దళ్‌ (సోనీలాల్)

నిషాద్ పార్టీ

సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ

ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్‌

నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ

సిక్కిం క్రాంతికారి మోర్చా

మిజో నేషనల్ ఫ్రంట్

జననాయక్ జనతా పార్టీ

హర్యానా లోఖిత్ పార్టీ

మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ

ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర

నాగా పీపుల్స్ ఫ్రంట్

శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్‌)

పుతియ తమిళగం

భరత్ ధర్మ జన సేన

కేరళ కామరాజ్ కాంగ్రెస్

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)

రాష్ట్రీయ సమాజ పక్ష

ప్రహార్ జనశక్తి పార్టీ

జన సురాజ్య పార్టీ

యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ

హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ

గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్

ఇండియా కూటమి పక్షాలు

ఇండియా కూటమిలో కాంగ్రెస్‌, ఆర్జేడీ, డీఎంకే, వామపక్షాలు సహా 26 పార్టీలు ఉన్నాయి.

భారత జాతీయ కాంగ్రెస్

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

ఆమ్ ఆద్మీ పార్టీ

ద్రవిడ మున్నేట్ర కళగం

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా

రాష్ట్రీయ జనతా దళ్

జార్ఖండ్ ముక్తి మోర్చా

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)

శివసేన (ఉద్ధవ్)

వంచిత్ బహుజన్ అఘాడీ

పీజెంట్స్‌ అండ్‌ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా

స్వాభిమాని పక్షం

సమాజ్‌వాదీ పార్టీ

రాష్ట్రీయ లోక్‌దళ్‌

అప్నా దళ్ (కామెరవాడి)

ఆజాద్ సమాజ్ పార్టీ

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)

జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్

కేరళ కాంగ్రెస్ (ఎం)

రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ

కొంగునాడు మక్కల్ దేశియా కచ్చి

మనితానేయ మక్కల్ కచ్చి

మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం

విదుతలై చిరుతైగల్ కచ్చి

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్

Somu

Somu

Next Story