Gold Rates | బంగారం కొనాలనుకుంటున్నారా..? త్వరపడండి మరి..! హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rates | బంగారం అంటే భారతీయులకు మక్కువ. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అలాగే చాలా మంది బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు. అయితే, ఇటీవల ధరలు గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ, జాతీయంగా బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. ప్రస్తుతం పుత్తడిని కొనుగోలు చేసేందుకు జనం జంకుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1995 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు స్పాట్ సిల్వర్ […]

Gold Rates | బంగారం అంటే భారతీయులకు మక్కువ. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అలాగే చాలా మంది బంగారంపై పెట్టుబడి పెడుతుంటారు. అయితే, ఇటీవల ధరలు గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ, జాతీయంగా బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. ప్రస్తుతం పుత్తడిని కొనుగోలు చేసేందుకు జనం జంకుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1995 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు స్పాట్ సిల్వర్ ఔన్సుకు ప్రస్తుతం 25 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరో వైపు రూపాయి మారకం విలువ పతనమైంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూ.82 మార్క్ వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం.. ఇవాళ ఎలాంటి మార్పు కనిపించలేదు.
పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,940గా ఉన్నది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,030 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర రూ.56,090 పలుకు తుండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,180 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో వెండి రూ.81,600.. ఢిల్లీలో రూ.78,500 పలుకుతుంది.