తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

విధాత: తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.నైరుతి రుతుపవనాలు ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు మధ్య, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలకు ఉత్తర వైపు కేంద్రీకృతమై ఉందన్నారు.అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 24గంటల్లో దక్షిణ […]

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

విధాత: తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.నైరుతి రుతుపవనాలు ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఉపసంహరించాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

తూర్పు మధ్య, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలకు ఉత్తర వైపు కేంద్రీకృతమై ఉందన్నారు.అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 24గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.కోస్తా కర్ణాటక తీరంలోని తూర్పు మధ్య అరేబియా సముద్ర పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి నేడు బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.