Bollaram | చికిత్స కోసం వస్తే చెట్టు కూలి దుర్మరణం

ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులపై చెట్టు కూలి భర్త మృతి చెందిన విషాదం రేపింది. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం స్కూటిపై వచ్చిన ఇద్దరు దంపతులపై ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు.

Bollaram | చికిత్స కోసం వస్తే చెట్టు కూలి దుర్మరణం

కంటొన్మెంట్ ఆసుపత్రి వద్ద విషాదం

విధాత, హైదరాబాద్‌ : ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులపై చెట్టు కూలి భర్త మృతి చెందిన విషాదం రేపింది. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం స్కూటిపై వచ్చిన ఇద్దరు దంపతులపై ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలడంతో భర్త రవిందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ అనూహ్య ఘటన నుంచి స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసే లోపే భారీ చెట్టు మీద పడిన బరువుకు భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సరళాదేవి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సరళాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది