Gutka Ban in Telangana | తెలంగాణలో గుట్కా తయారీ..అమ్మకాలపై నిషేధం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం కింద గుట్కా తయారీ, నిషేధంపై నిర్ణయం తీసుకున్నారు. గుట్కాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. గుట్కా, పాన్ మాసాలలో ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు, నికోటిన్ ఉండడం మూలంగానే వాటిని నిషేధించినట్లు పేర్కొన్నారు.