Raghunandan Rao | రాహుల్‌గాంధీకి బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు లేఖ

సెబీకి సంబంధించి హిండెన్ బర్గ్ కథనాలపై రచ్చ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బ్లిట్జ్ పత్రికలో రాహుల్‌గాంధీకి పెళ్లయిందని, పిల్లలున్నారని రాసిన కథనంపై కూడా స్పందించాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కోరారు

Raghunandan Rao | రాహుల్‌గాంధీకి బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు లేఖ

రాహుల్‌కు పెళ్లయి.. పిల్లలున్నారన్న కథనంపై స్పందించాలని డిమాండ్‌

Raghunandan Rao | సెబీ (SEBI)కి సంబంధించి హిండెన్ బర్గ్ (Hindenburg) కథనాలపై రచ్చ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) బ్లిట్జ్ పత్రికలో రాహుల్‌గాంధీకి పెళ్లయిందని, పిల్లలున్నారని రాసిన కథనంపై కూడా స్పందించాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను, బ్లిట్జ్ పత్రిక కథనాన్ని సోనియాగాంధీ నివాసంకు వెళ్లి అందులోనే ఉంటున్న రాహుల్‌గాంధీకి సిబ్బంది ద్వారా అందించారు. రాహుల్‌గాంధీకి హిండెన్‌ బర్గ్‌ వార్తలపై తప్ప సెబీపై, సుప్రీంకోర్టుపై, ప్రజాస్వామ్యంపై నమ్మ కం లేదని మండిపడ్డారు. బ్లిట్జ్‌ పేపర్‌ (Blitz Paper) లో రాహుల్‌ గాంధీకి పెండ్లయిందని, పిల్లలున్నారని రాశారని చెప్పారు. హిండెన్‌ బర్గ్‌ రాసింది నిజమే అయితే బ్లిట్జ్‌ రాసింది కూడా నిజమేనా? అని ప్రశ్నించారు.

ఒకవేళ తప్పయితే నోటీసులు ఎందుకు ఇవ్వటం లేదో రాహుల్‌గాంధీ చెప్పాలని ప్రశ్నించారు. హిండెన్‌ బర్గ్‌ నివేదికకు కాంగ్రెస్‌ అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రాజకీయంగా రచ్చ చేయడం చూస్తుంటే ఆ నివేదిక రూపకల్పనకు కాంగ్రెస్‌ సహకరించిందనే అనుమానం కలుగుతున్నదన్నారు. ఇకపోతే వ్యాపారాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడికి ఓ న్యాయం, సెబీ చైర్‌పర్సన్‌కు ఒక న్యాయమా? అని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు (Raghunandan Rao ) ప్రశ్నించారు. తన తమ్ముడైతే వ్యాపారాలు చేసుకోవద్దా? అని సీఎం అన్నారని, మరి సెబీ చైర్‌ పర్సన్‌ కంపెనీల షేర్లు ఎందుకు కొనొద్దని ప్రశ్నించారు. రాహుల్‌పై కథనం రాసిన బ్లిట్జ్‌ పేపర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సిట్‌ వేస్తారా? అని సవాల్‌ విసిరారు.