Telangana MLC bypoll | 30 కోట్లతో పట్టభద్రుల ఓట్ల కొనుగోలుకు బీఆరెస్ యత్నం

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 30కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆరెస్ పార్టీ తెరలేపిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు.

Telangana MLC bypoll | 30 కోట్లతో పట్టభద్రుల ఓట్ల కొనుగోలుకు బీఆరెస్ యత్నం

బీజేపీ నేత రఘునందన్‌రావు ఆరోపణలు
బీఆరెస్ ఖాతా సీజ్ చేయాలని ఈసీకి ఫిర్యాదు

విధాత, హైదరాబాద్ : వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 30కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆరెస్ పార్టీ తెరలేపిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖలు రాశారు. ఓ బ్యాంకులోని బీఆరెస్‌ అధికారిక ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇంచార్జిలకు నగదు బదిలీ జరిగినట్లు రఘునందన్ ఆరోపించారు. బ్యాంకు అకౌంట్ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని.. లేకుంటే కోట్లాది రూపాయలను ఓట్ల కొనుగోలుకు ఉపయోగిస్తారన్నారు. బీఆరెస్‌ ఖాతాను వెంటనే ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.