సీఎంను కలిసిన బీఆరెస్ ఎమ్మెల్యే
బీఆరెస్ పార్టీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు ఆదివారం కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ పార్టీ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు ఆదివారం కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి వెంకట్‌రావు రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయనకు పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వెంకట్‌రావు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఒకసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు మరోసారి వెంకట్‌రావు రేవంత్‌రెడ్డిని కలవడంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ప్రచారం వినిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆరెస్ గెలిచిన ఏకైక స్థానం భద్రాచలం మాత్రమే. వెంకట్‌రావు కూడా కాంగ్రెస్‌లో చేరితే ఆ జిల్లా నుంచి అసెంబ్లీలో బీఆరెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోనుంది.