కాంగ్రెస్,బీజేపీది కుర్చీల కొట్లాట
కాంగ్రెస్, బీజేపీది కుర్చీల కోసం కొట్లాట, ఖాళీ కుర్చీల తండ్లాట అంటూ బీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు

- రెండు పార్టీల రిమోట్ ఢిల్లీలో
- త్వరలో రైతు బంధు డబ్బులు
- పెద్ది కృషితో నర్సంపేటలో రెండు పంటలు
- నెక్కొండ రోడ్ షోలో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్, బీజేపీది కుర్చీల కోసం కొట్లాట, ఖాళీ కుర్చీల తండ్లాట అంటూ బీఆర్ఎస్ నేత, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. రాని సీఎం కుర్చీ పదవి కోసం కోట్లాడుకుంటూ నిండని కుర్చీలను నింపేందుకు యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మీటింగులకు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారని చెప్పారు. నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి, మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయకులకు మద్ధతుగా శనివారం నెక్కొండ, మహబూబాబాద్ లలో నిర్వహించిన రోడ్ షో లో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు కిలోమీటర్ల పొడువుతూ రోడ్డు షో జరిగింది. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికలంటే ఐదొద్దుల పండుగ కాదు ఐదేండ్ల బతుకుదెరువు అందుకే ఓటేసేముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని ఊర్లపొంటి తిరుగుతున్నారని చెప్పారు. ఆరునెలల క్రితం కర్ణాటకకు పోయి ఐదు గ్యారంటీలిస్తామని అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ చెప్పారు. నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న కరెంట్ బందయ్యిందీ, రైతు బంధు రద్దైయ్యిందని విమర్శించారు. చదువుల స్కాలర్ షిప్ లు ఆగిపోయాయన్నారు.

కాంగ్రెస్, బీజేపీలీ రిమోట్ ఢిల్లిలో
మన కెసిఆర్ వల్ల ఎవరికైనా తక్కవైందా? రైతుల వడ్లు కొనుగోలు చేసిండూ డబ్బులేశారన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఆదుకున్నారని హరీష్ రావు చెప్పారు. బీహార్, ఢిల్లీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తిరుగుతున్నారన్నారు. ఓట్లయిపోగానే ఢిల్లీలపడుతారూ మళ్ళీ ఇక్కడ మిగిలేదీ మన కెసిఆర్ అంటూ అందుకే మట్టిపనికైనా ఇంటోడే ఉండాలన్నారని హరీష్ రావు వివరించారు. మంచిపనిచేసే కెసిఆర్ కావాలా? మరకపడ్డ రేవంత్ రెడ్డి కావాలా? బీఆర్ఎస్ కావాలా? ఢిల్లీ పార్టీలు కావాలా? అంటూ ప్రశ్నించారు. ఈ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలను రిమోట్ తో నడిపేది ఢిల్లీ నాయకులన్నారు. కాళేశ్వరం నిర్మిస్తే మీ దగ్గర నీల్లొచ్చాయని వివరించారు. కాంగ్రెస్ హయంలో రెండు పంటలకు నీళ్ళిచ్చారా? మన హయంలో రెండు పంటలకు నీళ్ళిచ్చారని చెప్పారు. కర్నాటకలో ఐదుగంటలే కరెంట్ ఇస్తున్నామని అన్న డికె శివకుమార్ ఇప్పుడు వచ్చి ఏ రాష్ట్ర పరిస్థితి ఆ రాష్ట్రానిదేనంటున్నారని హరీష్ అన్నారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలంటున్నారని విమర్శించారు. 10 హెచ్ పి మోటార్ పెట్టుకోమంటున్నారు. ఈ మోటర్ కు డబ్బులెవరిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్నపుడు కరెంట్ దొంగోలిగే వచ్చేదన్నారు. రిస్క్ వద్దూ కారుకుగుద్దూ అంటూ నినదించారు.

త్వరలో రైతుబంధు డబ్బులు
కాంగ్రెస్ ప్రతీ రైతుకు ఏడాదికి 15 వేలు ఇస్తా అంటుంది. కానీ కేసీఆర్ ఎకరాకు 16 వేలు ఇస్త అన్నారని చెప్పారు. ఎన్నికల కమిషన్ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతినిచ్చిందని, సోమవారం పొద్దున చాయి తాగే వరకు మీ ఫోన్లు టింగు టింగుమంటాయన్నారు. దేవుడు మన తరపున ఉన్నడు. రైతులకు డబ్బులు ఇవ్వడం న్యాయమేనని దీవించిండన్నారు.మొత్తం తెలంగాణలో జిల్లా కేంద్రంలో కాకుండా మెడికల్ కాలేజీ ఉన్నది కేవలం నర్సంపేటలో ఇచ్చామన్నారు.నర్సంపేటలో బీఆర్ఎస్ గెలవంగనే నెక్కొండను మున్సిపాలిటీగా జీవో జారీ చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి, నాయకు లు నూకల నరేష్ రెడ్డి, పెద్ది స్వప్న తదితరులు పాల్గొన్నారు.