గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ.. కాంగ్రెస్ బీజేపీల ప్రచార పోరు

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కేంద్రంలోని పదేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ ఏమిచ్చిందంటూ గాడిద గుడ్డు ఇచ్చిందని వినూత్న ప్రచారం చేపట్టారు.

గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ.. కాంగ్రెస్ బీజేపీల ప్రచార పోరు

విధాత : తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కేంద్రంలోని పదేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ ఏమిచ్చిందంటూ గాడిద గుడ్డు ఇచ్చిందని వినూత్న ప్రచారం చేపట్టారు. రాహుల్‌గాంధీ, సీఎం రేంవత్ రెడ్డి ప్రచార సభల్లోనూ గాడిద గుడ్డు ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా బీజేపీ నేతలు వంకాయ ప్రచారానికి తెరలేపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఇచ్చింది ‘వంకాయ’, 120 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ అని ప్రచారం ప్రారంభించారు.

తెలంగాణలో ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు రేవంత్ రెడ్డి వంకాయ చేతిలో పెట్టాడని బీజేపీ నేతలు కాంగ్రెస్ గాడిద గుడ్డు ప్రచారంపై ఎదురుదాడి సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వంకాయ ప్రచారం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణకు 11లక్షల కోట్ల నిధులు వెచ్చించిందని బీజేపీ ప్రచారం సాగిస్తుంది.