వృద్ధ మ‌హిళ‌ను చెంప దెబ్బ‌కొట్టిన‌ జీవ‌న్ రెడ్డి

నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థి టీ. జీవ‌న్ రెడ్డి ఓ మ‌హిళ‌ను చెంప దెబ్బ కొట్ట‌డం సామాజిక మాద్య‌మాల్లో వైర‌ల్ అయింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ‌నివారం ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉపాధి హామీ ప‌థ‌కం కూలీల‌ను క‌లిశారు

వృద్ధ మ‌హిళ‌ను చెంప దెబ్బ‌కొట్టిన‌ జీవ‌న్ రెడ్డి

విధాత: నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థి టీ. జీవ‌న్ రెడ్డి ఓ మ‌హిళ‌ను చెంప దెబ్బ కొట్ట‌డం సామాజిక మాద్య‌మాల్లో వైర‌ల్ అయింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ‌నివారం ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉపాధి హామీ ప‌థ‌కం కూలీల‌ను క‌లిశారు. ఈ క్ర‌మంలో ఓ వృద్ధ మ‌హిళ‌తో మాట్లాడుతుండ‌గా జీవ‌న్‌రెడ్డి స‌ద‌రు మ‌హిళ చెంప‌పై కొట్టారు. చెంపపై కొడుతున్న క్ర‌మంలో త‌న వెంట ఉన్న నాయ‌కులు న‌వ్వుతున్నారు. ఈ వీడియో కాస్తా సామ‌జిక మాద్య‌మాల్లో వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌హిళ‌పై చేయి చేసుకోవ‌డాన్ని ఖండిస్తున్నారు. దీనిపై స్పందించిన జీవ‌న్‌రెడ్డి ప్రేమ‌తో ఆ మ‌హిళ‌ను అలా తాకాను అని చెప్పుకొచ్చారు. ఈ విష‌యంపై వృద్ధ మ‌హిళ‌ను అడ‌గ‌గా తాను ఇల్లు, పెన్ష‌న్ లేదు అవి ఇప్పించండ‌ని ఆయ‌న‌ను అడిగాను, దానికి ఆయ‌న హామీ ఇస్తూ దొర‌సాని నీకు అవ‌న్నీ వ‌స్తాయి అంటూ నా చెంప‌పై కొట్టార‌ని తెలిపింది. ఏది ఏమైనా స‌ద‌రు మ‌హిళ‌ల‌పై చేయిచేసుకోవ‌డం మాత్రం త‌ప్పేన‌ని ఆ వీడియో చూసిన ప్ర‌జ‌లంతా అంటున్నారు.