కృష్ణా నది ప్రాజెక్టుల పరిస్థితులపైన..కేఆర్‌ఎంబీకి అప్పగింతను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తీర్మానంపై అధికార కాంగ్రెస్‌, బీఆరెస్ సభ్యుల మధ్య సాగిన వాదప్రతివాదాలతో అసెంబ్లీ నీళ్ల పంచాయితీకి వేదికైంది.

  • తీర్మానం పెట్టిన మంత్రి ఉత్తమ్‌
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో బీఆరెస్ తప్పుల వెల్లడి
  • పదేపదే అడ్డు తగిలిన బీఆరెస్ సభ్యులు

విధాత : కృష్ణా నది ప్రాజెక్టుల పరిస్థితులపైన..కేఆర్‌ఎంబీకి అప్పగింతను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తీర్మానంపై అధికార కాంగ్రెస్‌, బీఆరెస్ సభ్యుల మధ్య సాగిన వాదప్రతివాదాలతో అసెంబ్లీ నీళ్ల పంచాయితీకి వేదికైంది. ముందుగా ప్రభుత్వం 'కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు..బీఆరెస్‌ ప్రభుత్వ తప్పిదాలు' పేరుతో నోట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో బీఆరెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. తెలంగాణ వచ్చాకే నీటి వాటాల్లో ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ తెలంగాణకు 731టీఎంసీలు అడగకుండా 299టీఎంసీలకు అంగీకరించి ఏపీ 511టీఎంసీలు వదిలేశారన్నారు. వాస్తావానికి 50శాతం చొప్పున ఆనాడు కేసీఆర్ డిమాండ్ చేయాల్సివుండేనన్నారు.

కేసీఆర్ హయాంలో 1200టీంసీలు అధికంగా శ్రీశైలం నుంచి ఏపీకి తరలించుకపోయింది. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే.. ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిందే బీఆరెస్ ప్రభుత్వమని ఉత్తమ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని.. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బీఆరెస్‌ ప్రభుత్వ నిర్ణయాలతో కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణకు జరిగిన అన్యాయాలను, ఏపీని జల దోపిడీని ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు.

కేసీఆర్ మద్దతుతో ఏపీ పొతిరెడ్డి పాడు నుంచి తెలంగాణ రాక ముందు 44వేల క్యూసెక్కులు తరలించుకపోతే వచ్చాకా 92,600క్యూసెక్కులు తరలించుకపోయిందన్నారు. రాలసీమ లిప్టు ఇరిగేషన్ కొత్తగా కట్టి 34,722క్యూసెక్కులు తరిలించుపోయిందన్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి కూడా అదే పద్దతిలో తెలంగాణ వచ్చాకే ఏపీ అధికంగా తరలించుకపోయిందని ఇందుకు కేసీఆర్ వైఖరినే కారణమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఓడిపోతారని తెలిసి ఆయనకు ఓటింగ్‌లో మేలు చేసేందుకు సెంటిమెంట్ రాజేసేందుకు ఏపీ సీఎం జగన్ తన పోలీసులను పంపి నాగార్జున సాగర్ డ్యాంపై హల్‌చల్ సృష్టించి 3టీఎంసీలు అక్రమంగా తరలించుకుపోయారన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా తమకు కూడా పవర్ పాయింట్‌ ప్రదర్శనకు తమకు కూడా అనుమతి ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. సభలో మంత్రి ఉత్తమ్ ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ తమకు నీటి తరలింపుకుకే సీఆర్ సహకరించిన తీరుపై చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ జగన్ స్టేట్‌మెంట్ విన్నాక కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని, గత ఎన్నికల్లో బీఆరెస్‌ను ప్రజలు చెప్పుతో కొట్టారని విమర్శించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకమని, పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ను అవమానించేదిగా ఉన్నాయని, అమేధి ప్రజలు రాహుల్‌గాంధీని చెప్పుతో కొట్టినట్లుగా మేం మాట్లాడొచ్చానని, వెంటనే ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ప్రసాద్ అందుకు అంగీకరించారు.

అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతు తమ హాయంలో కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని, తాముల కూడా 50శాతం చొప్పున కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించందంటూ తమ వాదనను పునరుద్ఘాటించారు. నల్లగొండలో బీఆరెస్ మీటింగ్ పెట్టడంతోనే ఈ రోజు అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం పెట్టిందన్నారు. అయితే మంత్రి ఉత్తమ్ మాత్రం హరీశ్‌రావు పదేపదే అబద్ధాలు చెబుతున్నాడని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేఆర్‌ఎంబీ సమావేశం మినిట్స్‌పై తాము ఎలాంటి సంతకాలు పెట్టలేదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ అనవసరంగా ప్రాజెక్టులపై తప్పులు మాట్లాడి దొంగలకు సద్దిమూట గట్టవద్దన్నారు. 551టీఎంసీలు తెలంగాణకు రావాలని తీర్మానం పెట్టారని దీనికి అనుకూలమా వ్యతిరేకమా బీఆరెస్ స్పష్టం చేయాలన్నారు. గతంలో కేసీఆర్‌ను కరీంనగర్ నుంచి తరిమితే పాలమూరుకు వస్తే తమకు నీళ్లను తీసుకొస్తారన్న నమ్మకంతో అక్కడి ప్రజలు కేసీఆర్‌ను అదరించి గెలిపించారని, ఇప్పుడు ప్రతిపక్షనేతగా సభకు రాకుండా ఫౌమ్‌హౌజ్‌లో దాక్కోని తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీశ్‌రావు మీరు కొడంగల్ ప్రజలు తరిమితే మల్కాజిగిరికి వచ్చారా అంటూ ఎదురుదాడి చేశారు.

Updated On 12 Feb 2024 9:41 AM GMT
Somu

Somu

Next Story