తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

మరో 577 మందికి కరోనా పాజిటివ్గత 24 గంటల్లో 1,11,226 కరోనా టెస్టులుజీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులుఅనేక జిల్లాల్లో తగ్గుముఖం పట్టిన కరోనారాష్ట్రంలో ఇద్దరు మృతి విధాత:తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,11,226 కరోనా పరీక్షలు నిర్వహించగా, 577 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 79 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 66 కేసులు గుర్తించారు. అనేక జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య రెండంకెలకు లోపే నమోదైంది. అదే సమయంలో 645 మంది […]

తెలంగాణలో పెరుగుతున్న కరోనా  కేసులు

మరో 577 మందికి కరోనా పాజిటివ్
గత 24 గంటల్లో 1,11,226 కరోనా టెస్టులు
జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు
అనేక జిల్లాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా
రాష్ట్రంలో ఇద్దరు మృతి

విధాత:తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,11,226 కరోనా పరీక్షలు నిర్వహించగా, 577 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 79 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 66 కేసులు గుర్తించారు. అనేక జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య రెండంకెలకు లోపే నమోదైంది.

అదే సమయంలో 645 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,48,388 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,35,895 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,674 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,819కి చేరింది.