రైతు వ్య‌తిరేక పార్టీలు బీజేపీ, బీఆరెస్: డిప్యూటీ సీఎం భ‌ట్టి

బీజేపీకి ఓటు వేస్తే హక్కులు పోయినట్లేన‌ని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. బుధ‌వారం నిర్మ‌ల్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు

రైతు వ్య‌తిరేక పార్టీలు బీజేపీ, బీఆరెస్: డిప్యూటీ సీఎం భ‌ట్టి

బీజేపీకి ఓటు వేస్తే హ‌క్కులు పోయిన‌ట్లే
మోదీ నియంతృత్వానికి, రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ మ‌ధ్యే ఎన్నిక‌లు
మీడియాతో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

విధాత‌: బీజేపీకి ఓటు వేస్తే హక్కులు పోయినట్లేన‌ని డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. బుధ‌వారం నిర్మ‌ల్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్నారు. మోదీ నియంతృత్వానికి, రాజ్యాంగ పరిరక్షణకు మధ్యనే ఈ ఎన్నికల సంగ్రామం జ‌రుగుతుంద‌న్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు తొలగించాలని మోదీ చూస్తున్నార‌న్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలన్నారు. ఈ రెండు పార్టీలు రైతు భరోసా రైతులకు రాకుండా అడ్డుకున్నాయ‌న్నారు. రైతులను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా రాకుండా బీజేపీ, బీఆరెస్‌లు కుట్ర చేశాయ‌న్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదు రెండు ఒకటే పార్టీలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే పని చేస్తున్నాయని ఆరోపించారు. బహుళ జాతి కంపెనీలకు దేశ సంపదను దారాదత్తం చేయడానికి మోదీ మూడోసారి ప్రధాని కావాలని దురాలోచన చేస్తుండన్నారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులను కాపాడేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. బీ ఆర్ ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే న‌న్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే హక్కులు కోల్పోతాం ప్రజాస్వామ్యం హరించబడుతుంద‌న్నారు. సంపన్నుల, వ్యాపారుల పార్టీ బీజేపీ , ప్రజల సంపద దోపిడీ చేసిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో చేతులు కలిపి మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాయని భ‌ట్టి ఆరోపించారు.