భూపాలపల్లి: కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ.. పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
విధాత, భూపాలపల్లి: మహిళలు రక్తహీనతతో బాధపడుతున్న ప్రాంతాలను ఎంపిక చేసి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించడం వల్ల గర్భిణీలకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన అభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు […]

విధాత, భూపాలపల్లి: మహిళలు రక్తహీనతతో బాధపడుతున్న ప్రాంతాలను ఎంపిక చేసి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించడం వల్ల గర్భిణీలకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన అభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు బాగా కష్టపడుతున్నారని కొనియాడారు. కరోనా సమయంలో బాగా కష్ట పడ్డారు. అందుకే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గర వారికి ఆ గౌరవం దక్కిందన్నారు.
భూపాలపల్లి జిల్లాలో గర్భిణీలు రక్త హీనతతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించి, ఈ జిల్లాను ఈ పథకం కింద సెలెక్ట్ చేసినందుకు సీఎం కేసిఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, జెడ్పి చైర్ పర్సన్లు శ్రీమతి హర్షిని, కుసుమ జగదీష్, కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొరిక గోవింద్ నాయక్, ఎంపీపీ శ్రీదేవి, జడ్పిటిసి భవాని, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ప్రేమలత , ట్రైబల్ వెల్ఫేర్ డిడి పోచమ్మ, హేమలత, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.