వరంగల్: మన్నించండి రెండు నెలలు మీకు దూరంగా ఉన్నా: ఎమ్మెల్యే రెడ్యానాయక్

మోకాలు చికిత్స చేయించుకున్న రెడ్యా బుధవారం విలేకరుల సమావేశం పలు అభివృద్ధి నిధులు మంజూరు విధాత, వరంగల్: అనారోగ్య కారణంగా రెండు నెలల కాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నందుకు ప్రజలు అర్థం చేసుకొని మన్నించాలని డోర్నకల్ నియోజకవర్గ సీనియర్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఇటీవల మోకాలు శాస్త్ర చికిత్స చేయించుకున్న నేపథ్యంలో రెండు నెలల పాటు ఆయన తన నియోజకవర్గమైన డోర్నకల్ కు దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన తిరిగి నియోజకవర్గానికి చేరుకున్న నేపథ్యంలో బుధవారం […]

వరంగల్: మన్నించండి రెండు నెలలు మీకు దూరంగా ఉన్నా: ఎమ్మెల్యే రెడ్యానాయక్
  • మోకాలు చికిత్స చేయించుకున్న రెడ్యా
  • బుధవారం విలేకరుల సమావేశం
  • పలు అభివృద్ధి నిధులు మంజూరు

విధాత, వరంగల్: అనారోగ్య కారణంగా రెండు నెలల కాలం నియోజకవర్గానికి దూరంగా ఉన్నందుకు ప్రజలు అర్థం చేసుకొని మన్నించాలని డోర్నకల్ నియోజకవర్గ సీనియర్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఇటీవల మోకాలు శాస్త్ర చికిత్స చేయించుకున్న నేపథ్యంలో రెండు నెలల పాటు ఆయన తన నియోజకవర్గమైన డోర్నకల్ కు దూరంగా ఉన్నారు.

ఇటీవల ఆయన తిరిగి నియోజకవర్గానికి చేరుకున్న నేపథ్యంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెడ్యా మాట్లాడుతూ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ డోర్నకల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఇంతకాలం తాను ఎన్నడూ నియోజకవర్గానికి దూరంగా లేనని అన్నారు. తొలిసారి 2 నెలల పాటు నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండటం ఆవేదన కలిగించిందని చెప్పారు.

ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ తాను వైద్యం చేయించుకుంటున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరు కోసం, అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నాలు అక్కడి నుంచే కొనసాగించానని చెప్పారు. ఈ క్రమంలోనే ఇటీవల గ్రామ పంచాయతీల అభివృద్ధికి, రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదలైనట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని, ఉండాలని కోరుకుంటున్నట్లు రెడ్యా ఈ సందర్భంగా చెప్పారు.

రూ.75కోట్లతో ఆర్అండ్‌బి, పంచాయతీ రాజ్ రోడ్లకు మర‌మ్మతులకు, నియోజకవర్గంలో 109 కొత్త పంచాయతీలకు పక్కాభవనాలు మంజూరుకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చాన్నారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి రెట్టింపు ఉత్సాహంతో సేవచేస్తానని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ తెలిపారు.

సాధారణంగా చాలామంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు జిల్లా కేంద్రంలో మకాం వేస్తూ ఉంటారు. లేదంటే హైదరాబాద్‌లో అడ్డా వేస్తారు కానీ రెడ్యా మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా డోర్నకల్ లేకుంటే హైదరాబాద్‌లో మాత్రమే మ‌కాం వేయడం ఆయన అనుసరించిన పద్ధతి. సమావేశంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అయూబ్ పాల్గొన్నారు.