విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

విధాత: విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామ రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించి తమ నిరసన తెలిపారు. పంట పొలాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. 24 గంటల కరెంటు సరఫరా చేయాల్సి ఉండగా మాకు 10 గంటలు కూడా సరఫరా కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నీరు స‌రిపోక వేసిన నారు ఎండిపోతుంద‌ని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటర్ల సంఖ్యకు […]

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

విధాత: విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామ రైతులు సబ్ స్టేషన్‌ను ముట్టడించి తమ నిరసన తెలిపారు. పంట పొలాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు.

24 గంటల కరెంటు సరఫరా చేయాల్సి ఉండగా మాకు 10 గంటలు కూడా సరఫరా కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నీరు స‌రిపోక వేసిన నారు ఎండిపోతుంద‌ని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటర్ల సంఖ్యకు సరిపడేలా ట్రాన్స్ ఫార్మర్స్ అమార్చాలని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ మెటీరియల్స్ సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు.

డబ్బులు ఇస్తేనే గాని పనులు కావడం లేదని, ఈ ప్రాంతంలోని రైతుల విద్యుత్ సమస్యలపై జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.