పెండింగ్ కేసులపై దృష్టి పెట్టండి… నేర సమీక్షలో DGP మహేందర్ రెడ్డి
మెదక్ జిల్లాలో తగ్గిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ప్రమోషన్ల పొందిన అధికారులను సత్కరించిన ఎస్పీరోహిణి ప్రియదర్శిని విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు నమోదు అయిన కేసుల్లో జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులపై జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష నిర్వహించారు. మెదక్ జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షలో డీజీపీ […]

- మెదక్ జిల్లాలో తగ్గిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు
- ప్రమోషన్ల పొందిన అధికారులను సత్కరించిన ఎస్పీరోహిణి ప్రియదర్శిని
విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు నమోదు అయిన కేసుల్లో జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులపై జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష నిర్వహించారు. మెదక్ జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
సమీక్షలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వెర్టికల్ అమలు విజయవంతం అయినదని అందులో భాగంగా 5s వెర్టికల్‌ను ఉదహరిస్తూ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లలో చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న వస్తువులు, వాహనాలను తొలగించడం, వేలం వేయటం జరిగిందన్నారు.
అన్ని జిల్లాల ఆర్ఐ స్టోర్స్ వస్తువులను క్రమబద్రీకరించి 5s అమలుకి మునుపు, 5s అమలు తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉన్నదని ఫోటోలు తీసి వివరించినట్టు తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, UI కేసులు, SC, ST కేసులు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న UI కేసులు, పోక్సో కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని, SC, ST కేసులలో కన్విక్షన్ రేట్ పెరిగిందని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ FSL రిపోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్లు చాలా ముఖ్యమని వాటిని త్వరగా తెప్పించుకొని ప్రతి రోజు కేసులను టార్గెట్గా పెట్టుకుని చేధించాలని సూచించారు.
వెర్టికల్ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచినవారికి రివార్డ్ మేలాలు నిర్వహించి సత్కరించాలన్నారు. అలాగే ఫోక్సో కేసులలో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా చూసి బాధితులకి తగు నష్టపరిహారం అందించాలని సూచించారు.
చట్టంపై సమాజములో అవగాహన కల్పించాలని, కేసులలో నేరస్థులకు శిక్షలు పడేలా ఇన్వెస్టిగేషన్ చేయాలని, సాక్షులకు మనోధైర్యాన్నిస్తూ సాక్షం చెప్పేలా మోటివేట్ చేయాలని అన్నారు. HRMS (హ్యూమన్ రిసోర్స్ మేనేజిమెంట్ సిస్టమ్) అప్లికేషన్ యొక్క పనితీరును వివరిస్తూ దాని వల్ల సిబ్బందికి కలిగే ఉపయోగాలను వివరించారు.
ఉద్యోగి డేటా, అవార్డులు రివార్డులు, ట్రాన్స్ఫర్ వివరాలు, ప్రయోజనాలు, ట్రైనింగ్, ఉద్యోగుల హాజరు తదితర ఉద్యోగి పూర్తి సమాచారం, ఈ HRMS అప్లికేషన్లో పొందుపరచాలని సిబ్బందికి తెలియజేశారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించి, కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు.
ప్రస్తుతం అలా నిరంతరం కృషి చేస్తున్న అధికారులందరికి అభినందనలు తెలిపారు. CCTNS ( క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం) నందు పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్/ కేసులు పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ చట్టపరమైన చర్యలు అనే అంశాలపై పలు సూచనలు ఆదేశాలు ఇచ్చారు.
అలాగే జిల్లా పోలీసు సిబ్బంది వెర్టికల్ విభాగాల వారీగా ఉత్తమ ప్రతిభ కనపరచిన వారిని అభినందించి ప్రశంసా పత్రాన్ని జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ .బి.బాలస్వామి, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, మెదక్ డీఎస్పీ సైదులు జిల్లా ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా సీఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.