బోనాల పండుగ వృత్తి దార్లకు ప్రభుత్వగుర్తింపు:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

విధాత,హైదరాబాదు: బోనాల పండుగ లో వివిధ రకాల సేవలందిస్తున్న వృత్తిదారులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం మహంకాళి ఉమ్మడి ఆలయాల వృత్తిదారుల సంఘం ప్రతినిధులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని తన ఛాంబర్ లో కలిసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తి దారులు గా బోనాల వేడుకలలో పూజలు, సేవలను అందిస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలించి […]

బోనాల పండుగ వృత్తి దార్లకు ప్రభుత్వగుర్తింపు:మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

విధాత,హైదరాబాదు: బోనాల పండుగ లో వివిధ రకాల సేవలందిస్తున్న వృత్తిదారులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం మహంకాళి ఉమ్మడి ఆలయాల వృత్తిదారుల సంఘం ప్రతినిధులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని తన ఛాంబర్ లో కలిసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వృత్తి దారులు గా బోనాల వేడుకలలో పూజలు, సేవలను అందిస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. వంశపారంపర్యంగా ఆయా అలయాల్లో వతన్ దారులు గా సేవలు అందిస్తున్న వారందరికీ తగిన పారితోషికం,గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ మట్టి మనుషుల పండుగ బోనాల పండగ అన్నారు.పండుగ వేడుకలలో కీలక పాత్ర నిర్వహించే వృత్తి దారుల సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. బోనాల పండుగ నిర్వహణ కోసం ఆయా ఆలయాలకు దేవాదాయశాఖ నుంచి విడుదల చేసే నిధులనుంచి వృత్తి దారులకు న్యాయం గా పారితోషికం అందించేదుకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. బోనాల సందర్భంగా కరోనామహమ్మారి నిర్మూలన చేయాలని కోరుతూ వృత్తి దారుల సంఘం ఆద్వర్యంలో సాక సమర్పించి అమ్మవారి ఆలయాలలో చేస్తున్ పూజలు, వేడుకలు చేస్తున్న వృత్తి దారులను మంత్రి అభినందించారు. ఈ సందర్బంగా ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు పేరోజీ మహేష్ ప్రధాన కార్యదర్శి బొడ్దుపల్లి నర్సింగ్ రావు. కోశాధికారి సుదర్శన్ తదితరులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అమ్మవారి జ్ఞాపిక ను అందించి సన్మానం చేశారు.