రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు,రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి భారీ చేరికలు కొనసాగాయి.

విధాత: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు,రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి భారీ చేరికలు కొనసాగాయి.
వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్ నరేందర్, మాజీ కార్పొరేటర్లు పద్మ, వసుంధర, శ్రీనివాస్, లక్ష్మణ్, పూర్ణ ప్రసన్న, పీఏసీ చైర్మన్ జనార్దన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సదానందం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేణు, రామకృష్ణ, శ్రీధర్ గౌడ్, ప్రవీణ్, సతీష్ తో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అదేవిధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ఎల్లయ్య, ఎంపీటీసీలు గౌతమి-అశోక్, సంగీత-సిద్దేశ్వర్, సర్పంచ్ చంద్ర శేఖర్, ఉపసర్పంచ్ లు మహేష్, మహేందర్, సురేష్ నాయక్, వార్డు సభ్యులు మానయ్య, భిక్షపతి యాదవ్, మణికొండ కౌన్సిలర్ లావణ్య-నరేష్, మాజీ సర్పంచ్ జైహింద్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయి రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారికి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.